గత ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచిన F3 సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని రాబట్టిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ కామెడీ ఎంటర్టైనర్ వెంకటేష్ - వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే నెక్స్ట్ ఆ కథకు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే.

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే సగం స్క్రిప్ట్ ని పూర్తి చేశాడట. దిల్ రాజు కూడా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలనీ రెడీ అవుతున్నాడు. కథ పూర్తయ్యే లోపు స్టార్స్ డేట్స్ తీసుకుంటే ఒక పనైపోతుందని అనుకున్నారట. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో మరొక కథానాయకుడిగా ఎవరు కనిపిస్తారని విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ మహేష్ బాబు ఒక 20 నిమిషాల పాటు F3లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి దిల్ రాజు ఇటీవల ఈ విషయాన్నీ మహేష్ ముందు ఉంచారట.

స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత మరొకసారి మహేష్ తో డిస్కర్షన్స్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ స్టార్ హీరోగా మారిన తరువాత గెస్ట్ రోల్స్ చేయలేదు. దీంతో అనిల్ కోసం మినీ మల్టీస్టారర్ లో నటిస్తాడో లేదో చూడాలి. ఇక అనిల్ వరుణ్ తేజ్ -వెంకటేష్ తో పాటు రవితేజని కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. త్వరలోనే F3 ప్రాజెక్ట్స్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.