కోలీవుడ్ లో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న నటి సోనా మద్యం తాగడాన్ని మానేశానని చెబుతోంది. తమిళంతో పాటు పలు భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కోలీవుడ్ లో కుశేలన్‌ షాజహాన్, గురు ఎన్‌ఆళు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి చివరిగా ప్రశాంత్ హీరోగా నటించిన 'జానీ' అనే సినిమాలో కనిపించింది. సిగరెట్ కాల్చడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు కూడా ఆమెకి ఉన్నాయి. ఆ మధ్య చిత్ర నిర్మాణం కూడా చేపట్టింది.

''హిట్టు సినిమాలే కాదు చెత్త సినిమాల్లో కూడా రికార్డ్ మాదే''

అయితే అది ఆరంభంలోనే ఆగిపోయింది. గతంలో తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలిచే సోనా ఈ మధ్య ఎక్కడా కనిపించడమ లేదు. దీంతో ఆమె నటనకి గుడ్ బై చెప్పిందనీ, ఎక్కడికో వెళ్లిపోయిందనీ ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్తలపై సోనా స్పందించింది. సోమవారం నాడు మీడియాకి ఓ ప్రకటన విడుదల చేసింది.

తాను సినిమాల్లో నటించడం లేదని, ఎక్కడికో వెళ్లిపోయినట్లు తనపై నిరాధార ప్రచారం చేస్తున్నారని.. నిజానికి తను ఎక్కడకీ వెళ్లలేదని.. నటనకు కూడా దూరం కాలేదని వివరించింది. ఈ ఏడాది నాలుగైదు చిత్రాల్లో నటించానని, పన్నెండు చిత్రాలను నిరాకరించినట్లు చెప్పింది.

జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నట్లు చెప్పింది. డబ్బు కోసం పరుగులు తీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. ఇంతకముందులా కాకుండా తాను ఇప్పుడు పరిపక్వత చెందినట్లు పేర్కొంది. మద్యపానం సేవించడం మానేశానని చెప్పింది. ఈ ఏడాదిలో ఛేజింగ్, పరమ పదం విళైయాట్టు, అసాల్ట్, తేడుదల్, పచ్చమాంగా తదితర చిత్రాల్లో నటించానని.. కొత్త సంవత్సరంలో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.