టాలీవుడ్ హీరోల్లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతి బాబు. హీరో నుంచి విలన్ గా మాస్ ఆడియెన్స్ డిఫరెంట్ గా ఆకర్షించిన జగ్గుభాయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా క్లిక్కయ్యాడు. అలాగే అపుడపుడు కథానాయకుడిగా కూడా పలు ప్రయోగాత్మక కథల్లో నటిస్తున్నాడు.

చేస్తే ఛాలెంజిగ్ రోల్ లో చేయాలనీ ఫిక్స్ అయిన జగ్గు భాయ్ ఇప్పుడు ఒక బోల్డ్ మూవీతో ఆడియెన్స్ కి సరికొత్త షాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. డాన్స్ మాస్టర్ విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమాలో జగపతి కండోమ్స్ తయారు చేసే కంపెనీలకు అధినేత అని తెలుస్తోంది. అలాగే వేశ్య ప్రేమలో పడతాడట.  ఇక ఆ నిరోద్ కంపెనీ కి సంబందించిన యాడ్స్ ని వేషాలతో చిత్రీకరిస్తారట.

అప్పుడే ఓ వేశ్య తో ప్రేమలో పడతాడని సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబందించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న తరుణంలో జగపతి ఇలాంటి పాత్రలు చేయడం ఒక ప్రయోగమనే చెప్పాలి. ఎమోషనల్ గా సాగే లవ్ కంటెంట్ సినిమాకు హైలెట్ పాయింట్ అని తెలుస్తోంది. మరీ ఆ సినిమా జగపతి బాబుకి ఎంతవరకు హిట్టొస్తుందో చూడాలి.

మహేష్ vs బన్నీ.. కళ్యాణ్ రామ్ కొట్టేలా ఉన్నాడు!