నెగిటివ్ రోల్స్ చేస్తూ బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అజాజ్ ఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అజాజ్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. కరోనా క్రైసిస్ నేపథ్యంలో అజాజ్ ఖాన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ముంబై పోలీసులు అతడిని బుక్ చేశారు. 

తన సోషల్ మీడియా పేజీ వేదికగా అజాజ్ ఖాన్ లైవ్ లో మాట్లాడుతూ ఇండియాలో కరోనా వ్యాప్తి గురించి ప్రస్తావించాడు. చీమ చనిపోయినా ముస్లింలే కారణం అంటూ.. ఏనుగు చనిపోయినా ముస్లింలే కారణం అంటారు. ఢిల్లీలో భూకంపం వచ్చినా ముస్లింలపైకే నెట్టేస్తారు. 

ఓ బావా అంటూ ఊపేసింది.. తేజ, పూరి కుమార్తెలలో ఆ ట్యాలెంట్.. డైరెక్టర్స్ కుమార్తెలా మజాకా

దేశంలో ఏ సంఘటన జరిగినా అందుకు కారణం ముస్లింలేనా.. ముందు ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకోండి అంటూ అజాజ్ ఖాన్ బిజెపి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

విపత్కర పరిస్థితుల్లో అజాజ్ ఖాన్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉండడంతో ముంబై పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అజాజ్ ఖాన్ తెలుగులో దూకుడు, నాయక్, టెంపర్ లాంటి చిత్రాల్లో నటించాడు.