సోషల్ మీడియాలో ఒక హీరో అభిమానులకి మరో హీరో అభిమానులతో మాటల యుద్ధం జరుగుతుంటూంది. ఒకప్పుడు కోలీవుడ్ లో కనిపించే ఇలాంటి గొడవలు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కనిపిస్తున్నాయి. ఒక్కోసారి ఇలాంటి ఘటనలు తీవ్ర సమస్యలకు దారి తీస్తుంటాయి.

ఈరోజు సోషల్ మీడియాలో #TeluguRealHeroes, అలానే #UnrivalledTamilActors అనే రెండు హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. తమిళ హీరో అభిమానులంతా మా హీరోలు గొప్పంటే.. తెలుగు వారంతా కాదు.. కాదు.. మా హీరోలే గొప్ప అంటూ ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.

తమిళోళ్లు చేస్తే మాట్లాడలేదే..? హీరో సిద్ధార్థ్ కి రివర్స్ ట్రోల్స్

తమిళ హీరో ధనుష్ నటించిన 'అసురన్' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ హీరోగా నటిస్తున్నారు. దీనికి 'నారప్ప' అనే టైటిల్ ఫైనల్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. వెంకీ లుక్ అడిరిపోయిదంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ధనుష్ ఫ్యాన్స్ మాత్రం వెంకీ లుక్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

సాంబార్ vs బిర్యానీ.. తెలుగు, తమిళ హీరోల ఫ్యాన్ వార్!

అది కాస్త.. తెలుగు సినీ ఫ్యాన్స్, తమిళ సినీ ఫ్యాన్స్ మధ్య యుద్ధంగా మారింది. దీనిపై స్పందించిన హీరో సిద్ధార్థ్.. సౌత్ ఇండియా ఫ్యాన్స్ లో పైత్యం పెరిగిపోయిందని.. #UnrivalledTamilActors vs #TeluguRealHeroes అంటూ హ్యాష్‌ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ ఇంటర్నెట్ ని వేస్ట్ చేస్తున్నారు.. ఇలాంటి యంగ్‌స్టర్స్ దేశానికి ఎంతో అవసరమని కానీ వీళ్లు మాత్రం ఇలాంటి పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.