ఒకప్పుడు ఎన్టీఆర్, మహేష్ బాబు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది. అది సద్దుమణిగేలోగా.. అల్లు అర్జున్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య యుద్ధం మొదలైంది. సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు హీరోలు నటించిన 'అల.. వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ అంటే కోలీవుడ్ ఇండస్ట్రీనే గుర్తొచ్చేది. స్టార్ హీరోలు అజిత్, విజయ్ ల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగేది. ఇప్పటికీ కూడా వారి సినిమాలు రిలీజ్ అయినా, కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని పోట్లాడుకుంటూంటారు.

ఇప్పుడు అదే పరిస్థితి టాలీవుడ్ కి కూడా పాకింది. ఒకప్పుడు ఎన్టీఆర్, మహేష్ బాబు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది. అది సద్దుమణిగేలోగా.. అల్లు అర్జున్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య యుద్ధం మొదలైంది. సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు హీరోలు నటించిన 'అల.. వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

తమిళోళ్లు చేస్తే మాట్లాడలేదే..? హీరో సిద్ధార్థ్ కి రివర్స్ ట్రోల్స్

ఈ సినిమాల విషయంలో మహేష్, బన్నీ ఫ్యాన్స్ గొడవ పడుతూనే ఉన్నారు. దానికి తగ్గట్లే మన హీరోలు కూడా తమ సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయని.. ఒకరు వంద కోట్ల పోస్టర్ వేస్తే, మరొకరు రెండు వందల కోట్ల పోస్టర్ వేస్తున్నారు. హీరోలే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా..? సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టారు. బన్నీ ఫ్యాన్స్ #FakeQueenMaheshBabu అనే ట్యాగ్ ని ట్రెండ్ అయ్యేలా చేశారు.

ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ #FakingKaBaapAlluArjun అనే మరో ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేశారు. సోషల్ మీడియాలో ఈ రచ్చ జరుగుతున్న సమయంలో హీరో సిద్ధార్థ్.. బన్నీ, మహేష్ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ సిగ్గుచేటు అనే పదాలు ఉపయోగించారు. దీంతో వారు రివర్స్ లో సిద్ధార్థ్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి వార్స్ మొదలైందే కోలీవుడ్ నుండి అని.. అక్కడేం మాట్లాడలేక.. తెలుగు సినిమాలు, హీరోలపై కామెంట్స్ చేస్తున్నాడని మండిపడ్డారు.

 ఈ విషయం కోలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల వరకు వెళ్లడంతో వారు సోషల్ మీడియాలో తెలుగు హీరోల గురించి కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా కోలీవుడ్ లో ధనుష్ నటించిన 'అసురన్' సినిమాని తెలుగులో వెంకీ రీమేక్ చేస్తున్నారు. దీనికి 'నారప్ప' అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ కూడా వదిలారు. పోస్టర్స్ అన్నీ కూడా ధనుష్ లుక్ ని అచ్చు దింపినట్లుగా ఉన్నాయి. దీంతో తమిళ ఫ్యాన్స్ తెలుగు హీరోల గురించి తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టారు.

దీంతో ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా మరో వార్ మొదలైంది. తెలుగు హీరోల అభిమానులు, తమిళ హీరోల అభిమానులు కలిసి సోషల్ మీడియాలో గొడవ పడడం మొదలుపెట్టారు. మన వాళ్లంతా కలిసి టాలీవుడ్ హీరోల గొప్పదనం గురించి పోస్ట్ లు పెట్టడంతో పాటు మన హీరోల సినిమాలను అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోలు రీమేక్ చేశారని.. ఆ సినిమాలతోనే వాళ్లకి హిట్స్ వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు. 

'#TeluguRealHeroes' అనే ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇదంతా చూసిన కోలీవుడ్ హీరోల ఫ్యాన్స్ #UnrivalledTamilActors అనే మరో హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. తెలుగు సినిమాలను రీమేక్ చేసినా.. మా వెర్షన్ తెలుగు కంటే గొప్పగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికైనా హీరోలు కల్పించుకొని ఈ విషయాన్ని ఓ కొలిక్కి తీసుకొస్తారేమో చూడాలి!

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

Scroll to load tweet…