ఆ ‘తెలుగు’ పేరుతో తమిళ అసెంబ్లీ కౌరవ సభ అయింది

The Telugu name that turned  Tamil Assembly into a hell for Jaya

జయలలిత జయరామన్ చనిపోయారు...అంతకు ముందు అన్నదురై, ఎంజిఆర్ లు చనిపోయారు,అవును మరణం అనివార్యం. 

 

ధిక్కరించినవాల్లే ధీరులు,ప్రతిఘటించినవాల్లే నాయకులుగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది.తమిళనాడు రాజకీయచరిత్ర, సామాజిక పరిణామక్రమం దేశచరిత్రలో వారికి ప్రత్యేక స్థానం కల్పించింది. జయరాజకీయాలు పగ, కసితోనే నడిచాయి. అమె పగబెడితే, గెల్చి తీరతారు. కసి పెంచుకుంటే కడదాకా పోరాడతారు.  అమె జీవితంలో  ఇలాంటి ఘట్టాలు చూద్దాం.

 

"అమ్మ" జయలలిత చనిపోయారు, మనసులొ చరిత్ర జ్ఞాపకాలు ఉప్పొంగుతున్నాయి.ఇదే డిసెంబర్ నెలలొ 29 సంవత్సరాల క్రిందట 24-డిసెంబర్ ,1987 నాడు ఎంజిఆర్ చనిపోయిన సన్నివేశాలు కళ్ళముందు మెదులుతున్నాయి.

 

1984లో ఎంజిఆర్ కు కిడ్ని సమస్యలు వచ్చిఛెన్నయ్ అపోలో నెఫ్రాలసిస్టు, ఎం కె మణి పరిక్షించి మూత్రపిండం మార్చాలని   నిర్ధారించిన విషయాన్ని పత్రికలుకు అపోలో ప్రతాప్ రెడ్డిగారు స్వయంగా తెలియచేశారు. అమెరికాలో ఆపరేషన్ జరిగి కొంచం కోలుకోని ఇండియాకు తిరిగి వచ్చిన ఎంజిఆర్ మరలా సచివాలయానికి వెళ్ళింది దాదాపు లేదు. ఎంజిఆర్ మద్రాస్ శివార్లోని రామాపురంలోని ఫామ్ హౌస్ చివరి 2.5 సంవత్సరాలు గడిపి డిసెంబర్, 24 -1987 న కన్నుమూసారు.   

 

మరసటిరోజు "క్రిసమస్"నాడు ఎంజిఆర్ అంత్యక్రియలు జరిగాయి.పిచ్చి ఉద్రేకంతో అభిమానులు విద్వంసానికి దిగారు..." ఎంజిఆర్ లేని మద్రాస్ ఎందుకు"?అని నగరాన్ని తగలపెట్టారు.ఈ హింసలో మొత్తంగా 29 మంది చనిపోయారు,45 మంది పోలీసులు గాయపడ్డారు.

 

అంతకు ముందు ఎంజిఆర్ గురువు, డికె వ్యవస్థాపకుడు "అణ్ణాదురై" చనిపోయినప్పుడు దాదాపు 2 కోట్ల మంది అంత్యక్రియలకు హాజరైనా హింస జరగలేదు. ఎంజిఆర్ అంటే ప్రజలకు పిచ్చి ,దురభిమానం...ఇప్పుడు జయ అంత్యక్రియలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను.

 

నాకు జయ మీద లేక మరో రాజకీయ నాయకుడి మీదనో అభిమానంలేదు.జయ బాగుండాలి అని పోస్టు పెట్టటం వెనుక ఉద్దేశ్యం రాజకీయ "సుస్థిరత"ను కోరుకోవటం.ఎన్నికైన ప్రతి ప్రభుత్వం పూర్తి కాలం పాలించాలి,ఆ ముఖ్యమంత్రి లేక ప్రధాన మంత్రి సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలి అప్పుడే సుస్థిరత సాధ్యమవుతుంది. 

 

ఎంజిఆర్ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం వుంచిన "రాజాజి హల్లో"నే  ఇప్పుడు జయ పార్థీవ దేహాన్ని వుంచారు.జయ రాజకీయ "కసి" ఇదే హాల్లొ ఆమెను ఎంజిఆర్ శవం దగ్గర నుంచి పార్టిలో ప్రత్యర్ధి వర్గం దూరంగా పంపించటానికి చేసిన ప్రయత్నంతోనో మొదలైంది. ఎంజిఆర్ శవయాత్రలొ ఆయన పక్కన నిలబడివున్న జయను ఎంజిఆర్ భార్య జానకి బంధువు కిందికి లాగివేయటంతొనే ఆధిపత్యపోరుకు స్పష్టమైన బీజాలు పడ్డాయి. 

 

ఎఐడిఎంకెలో ఎంజిఆర్ తరువాత ఎక్కువ ఎమ్మెల్యేల బలమున్న ఆర్ ఎం వీరప్పన్ ముఖ్యమంత్రి కావటానికి చేసిన ప్రయత్నాలను మరో మంత్రి ఎస్.రామచంద్రన్ అడ్డుకోవటానికి రాజ్యసభ సభ్యురాలిగా వున్న జయ వర్గంలో చేరి ఎత్తుకు పైఎత్తులు వేశారు. చివరికి ఈ పోరు మంత్రులను దాటి ఎంజిఆర్ భార్య జానకిరామచంద్రన్  వెర్సెస్ ఎంజిఆర్ స్నేహితురాలు జయల మధ్య పోరుగా మారింది.  

 

ఎంజిఆర్ మరణం తరువాత "ఆపధర్మ" ముఖ్యమంత్రిగా వున్న "నెడుంజలీయన్" శాశ్వత ముఖ్యమంత్రి కావటానికి చేసిన ప్రయత్నాలు గవర్నర్ ఖురానా మద్దతు ఇవ్వకపోవటం వలన విఫలం అయ్యాయి.1969లో అన్నాదురై చనిపోయినప్పుడు కూడ నెడుంజళీయన్ ఒక వారం పాటు ఆపధర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

 

అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి మద్దతు ఇవ్వటంతో జానకిరామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు.కాని అసెంబ్లీలో బలనిరూపణలొ పెద్ద యుద్దం జరిగి చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని రద్దుచేసింది.

 

మొదట జానకి రామచంద్రన్ కు  63 ఎమ్మెల్యేలు వున్న కాంగ్రేస్ మొదట మద్దతు ఇచ్చినా బలనిరూపణ ముందు రాత్రి మద్దతు విరమించి జానకిగారి ప్రభుత్వాన్ని కూల్చమని పార్టి ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చింది.కాంగ్రేస్ అభిప్రాయాన్ని మార్చుకోవటానికి ముఖ్యకారణం జానకి వర్గ వ్యూహకర్త "వీరప్పన్" కాంగ్రేస్ సభ్యులను కొనటానికి ప్రయత్నం చెయ్యటం.

 

మాములుగా అయితే జయలలితకే రాజీవ్ మద్దతు ఇచ్చివుండాలి కాని జయతో సినిమా రంగంలో వున్న విభేధాలు లేక తమకన్న పెద్ద నాయకురాలు అవుతుందన్న అభిప్రాయంతోనో అప్పటి కాంగ్రేస్ పార్టి ఎంపిలు వైజయంతి మాల & శివాజిగణేశన్ జయకు కాంగ్రేస్ మద్దతు దక్కకుండ అడ్డుకున్నారు.

 జానకి రామచంద్రన్ విశ్వాస తీర్మానం జనవరి 28, 1988 రోజు చరిత్రలో ఇప్పటి కూడ జరగనన్ని దారుణాలు జరిగాయి.

గవర్నర్ ఖురానా మొత్తం సభ్యులు 234లో సగం మంది మద్దతు కాకుండ సభలో వున్న సభ్యులలో సగం మంది మద్దతు సరిపోతుందని చెప్పారు.

స్పీకర్ పాండ్యన్ ఏకపక్షంగా వ్యవహరించారు.ఐదుగురు కాంగ్రేస్ ఎమ్మెల్యేలు ఫోన్లో రాజినామ చేశారని ప్రకటించారు.నెడుంజళీయన్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను "వోటింగ్ "కు ముందే విప్  దిక్కరించారని అనర్హత చేశారు.సభలోకి పోలీసులు ,బయటి వ్యక్తులు ప్రవేశించి లాఠిచార్జి చేశారు.15 మంది కాంగ్రేస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా గాయపడ్డారు.చివరికి 99 మంధి సభ్యుల మద్దతుతో జానకి గారు  విశ్వాస తీర్మానం గెలిచారు.8 మంది వ్యతిరేకంగా ఓటువేయగా ముగ్గురు తటస్థంగా వున్నారు.ఆవిధంగా 234 గాను 110 మంది వున్న సభలో జానకిగారు సభ విశ్వాసాన్ని పొందారు.ఇవన్ని చూసి చిర్రెత్తిన రాజీవ్ గాంధి 2 రోజుల్లోనే జానకిగారి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు.  

   

1989లో జరిగిన ఎన్నికలలో జయ వర్గం,జానకి వర్గాలు విడి విడిగా పొటి చెయ్యాగా వీరి మధ్య పోరును కరుణానిధి గెలిచి తీర్చారు.శివాజి గణేషన్ సొంత పార్టి పెట్టి జానకి వర్గంతో పొత్తుపెట్టుకోని పోటిచేసినా ఒకా సీటు దక్కలేదు.వీళ్ళ కూటమికి కేవలం 2 సీట్లే దక్కాయి.

 

ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిన జయకు డిఎంకె నుంచి నిత్యం ర్యాగింగ్ ఎదురైంది.

బడ్జెట్ సమావేశాలలొ కరుణానిధికి  జయకు మాటా మాట పెరిగింది. జయ కరుణానిధిని  కుట్రదారుడు  అంటూనేరారోపణలు వున్నవాళ్ళు ఎలా బడ్జెట్ ప్రవేశపెడతారు అనటం దానికి ప్రతిగా కరుణ  "వెళ్ళి శొభన్ బాబు"ను అడుగు అనటంతో ఘర్షణ జరిగింది.

 

The Telugu name that turned  Tamil Assembly into a hell for Jaya

ఎఐడిఎంకె ఎమ్మెల్యే "సెంగొటయ్యన్" కరుణానిధిని తోసివేశాడు. జయ మీదికి డిఎంకె ఎమ్మెల్లే పేపర్లు,బడ్జెట్ పేపర్ కట్టలు విసిరివేయ్యగా, ముపనార్ & ఇతర ప్రతిపక్షాల నాయకులు ఆమెకు అడ్డుగా నిలబడి సభ నుంచి బయటకు తీసుకొస్తుండగా  మంత్రి "దురైమురుగన్" జయను పట్టుకొని లాగబోగా ఆమె చీర జారింది. ఈ దుశ్యాసన సభలో ముఖ్య్మంత్రిగానే వస్తానని శపధంచేసి బయటకు వెళ్ళిన జయ 1991 ఎన్నికలలొ గెలిచి ముఖ్యమంత్రిగా మళ్ళి సభలో అడుగుపెట్టారు—ఈ గెలుపు ఆమెను "పురిచ్చిత్తి తలవై"ని చేసింది.

 

1996లొ ఓటమి,2001లొ గెలుపు, మళ్ళి 2006లొ ఓటమి తిరిగి 2011లో గెలుపుతో పాటు తమిళనాడు చరిత్రని తిరగరాసి ఎంజిఆర్ తరువాత(1977,1980 & 19084) వరుసగా రెండవసారి గెలిచింది.

 

2016 ఎన్నికల నాటికే ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్న జయా గెలిచిన తరువాత పెద్దగా ప్రజలలో తిరగలేదు,అంతకు ముందు అబ్ధుల్ కలాం అంత్యక్రియలకు కూడ హాజరు కాలేదు.  

 

ఇప్పుడు తమిళనాడులొ అన్ని "అమ్మే".  అంతా "అమ్మే". జయ మరణం తరువాత ‘సాఫీ’గానే  పన్నీర్ సెల్వ ఎన్నిక జరిగింది...ముందు ముందు ఎలాంటి వొడిదుడుకులు లేకుండా 2021 ఎన్నికల వరకు పాలన సాగాలి ఈ లెక్కన. చూద్దాం ఏ మవుతుందో.

 

చరిత్ర జయలలితగారిని గుర్తు ట్టుకుంటుంది.జయా ఒక పరిపూర్ణ రాజకీయ కెరటం.