జిలేబి మాబు!!

maitreya murali takes a stroll in to his childhood days and introduces jilebi mabu

అవి నా పిల్లపుడు రోజులు. వుత్త నిక్కరొకటి ఉంటాండె.   ఆడ పిల్లొళ్లయితే నెత్తి దుక్కోకుండా చింపిరి జుట్టు తో ఎర్ర రిబ్బన్లు యాల బడతాకు ఉరుకుతాంటే ఎద్దుల కొమ్ములకు కట్టిన కుచ్చుల్లగా ఊగుతాండ. చీమిడి ముక్కులతో ఆ వయ్యారం వర్ణించెేకీ కాదు.

అప్పుట్లో మావూరి బడికి సెలువులు ఒచ్చినాయంటే మాకు బొగ ఆనందంగా వుంటాండ, చేన్ల కాడికి,బాయి కాడికి, చెట్లoటా పుట్లాంటా తిరుగుతాంటే ఆ హాయి చెప్పేకి లేదు,ఓగ్యాల వారి మల్లు నాటేడప్పుడు,వరిమల్లు కోసేడప్పుడు,కుప్పలు ఊడ్చేడప్పుడు,చెనిక్కాయ పీకే టప్పుడు, చెనిక్కట్ట కళ్ల్లమ్ లో తోలి చెనిక్కాయలను విడిపిచ్చాంటేటప్పుడు మా చిన్నపిల్లొల్లు చేసే పనికి మా పెద్దోళ్ళుఎంత లెక్కిచ్చిన వాళ్ళు మా రుణం తీర్చుకోలేరు, యిన్గా చెప్పాలనంటే వాళ్ళు మా శ్రమను కొనలేరు, మమ్మల్ని బతిమలాడో, బుజ్జగించుకోనో పని చెపిచ్చుకోవడం వాళ్లకు గౌరవం గా బావించేవాళ్ళు(ల్యాకపోతే మనమ్ యినము గదా)
ఎవరన్న మా కల్లాల దావలో పోయే పెద్దోళ్లతో మా వాళ్ళు గొప్పలు పోవాలంటే ఆ మాత్రం ఉండల్ల గదా!!(చూళ్లే మా వాడు పని ఎట్ల జెచ్చందడో అంటే అప్పుడు మాకు వచ్చిన గర్వంతో కూడిన సిగ్గును ఇంత వరకు ఏ కవి వర్ణించిండడు)..
అదే గదా మాకు మాంచి అవకాశం ఎవరో చెప్పినట్లు దీపం ఉన్నట్లు గానే ఇల్లు సరిగ్గా పెట్టుకోవల్ల అనే పదం గుర్తొచ్చాoడనేమో వెంటనే మాకు గుర్తొచ్చేయి, మాబాష మామ అంగట్లో బోరుగుల మిచ్చరు, ఎల్లనూర్ పాగంపప్పు సాయిబు,జిలేబి మాబు, అయ్యాలపొద్దుకాడ ఖాజా భజ్జిలు

*******
మన్న పద్దన్నే మా వూరి కాడనుండి అనంతపరం వచ్చాంటే మావురికి XL యెనకాల నాలుగు మూలలండే పెద్ద చెక్కతో చేసిన డబ్బాలో వాడేసిన యూరియా సంచుల మధ్యలో గులాబీ రంగు ప్లాస్టిక్ డబ్బా కనపడింది అ వెంటనే నా కళ్ళు XL తోలుతండే మనిషిమీద పడినాయ్ అప్పుడు అనిపిచ్చింది ఒకప్పుడు మన ఊరికి సైకిల్ లో ఏనకాల రెండు యూరియా సంచులు ఏసుకొని యేనకాల క్యారీ మీద పెద్ద సిలవరు టిపెనలో జిలేబి ఎత్తుకొని వొచ్చి అమ్ముకొని పోతాండే  మన జిలేబి సాయిబు మాబు అని!! 
నేను ఆయప్పను చూసిన ఆనందంలో  నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి నాయి,ఆయప్పను ఆపి ఏన్నా బాగుండావా నన్ను గుర్తు పట్టినావా అని అడిగినా? బాగుండాబ్బి నువ్వెందుకు గుర్తుకు లేవు లింగప్పగారి లచ్చిమినారాయనోల్ల పిల్లోనివి గదా అన్యాడు.. బాగ గుర్తు పట్టినవ్గదన్న అంటే?
ఓబ్బి నువ్ పిల్లపుడు యెట్లా లావుండవో యిప్పుడుగుడా అట్లనే వున్డావు గదా అన!
సర్లెన్న యాపారం యెట్లా జరుగుతాంది అంటే యాడ యాపారంబ్బి సరిగ్గా వానలు రాక రైతులు పంటలు లేక అల్లాడినారు యిద్దో ఈ సమస్తరమే రొంత వానలు పడ్తండాయి ఈ సారాన్న పంటలు బాగా పండితే అన్ని పంటలు కల్లాళ్లోకి వచ్చి చేరితే రైతుల సంతోషం మేము ఎత్తకపోయిన జిలేబి బుట్ట కాలి అయితాంటే చూడచ్చు. అట్లా జరక్క చాన్నాల్లయ్యింది,
యింగా జెప్పల్లంటే చానా ఏండ్లయ్యింది!
ఆయన కళ్ళల్లో రొన్ని నీళ్లు తిరగడం సుసినా.. అప్పుదనుకున్న్నా మా చిన్నప్పుడు  లెక్కలు దెంకపొడానికి జిలేబి ఎత్తకచ్చి రొంచేపుకు జిలేబి అయిపోగొట్టుకొని పోతాండే సాయిబుతోనేనా నేను మాట్లాడతాoడేది అని, అప్పుడే స్పృహలోకి వచ్చి గమనిచ్చినా ఆయప్ప కన్నీళ్లు చూసిన తర్వాత రైతు మీద వున్న ప్రేమను,పెరిగిన వాతావరణం మీద ఆప్యాయతను, తర్వాత ఆలోచించ గలిగా రైతే రాజు,దేశానికి గ్రామాలే ఎందుకు పట్టుగొమ్మలయ్యినయో అనేది!!

maitreya murali takes a stroll in to his childhood days and introduces jilebi mabu

 

యింగపోతే ఆయప్ప తీసిన డబ్బానుజుచ్చానే చుట్టల చుట్టల జిలేబిలతో నా కళ్ళు జిగేల్ జిగేల్ మన!!
అప్పుడు జిలేబి జ్ఞాపకాల వలలో నేను జిక్కుకుంటి!!

ట్రుయ్యూ ట్రుయ్యూ ట్రుయ్యూ.....

"మైదా పిండి లక్షణం!!

చెక్కర,బెల్లం ల పాకం!!

పసిడి కాంతుల వర్ణం!!

చుట్టలు చుట్టబడిన సోయగం!!

చుంచిన తేనెలురేటి అమృత పానీయం!!

నోటికందిస్తే మళ్లీ తినాలనిపించే మధురం!!

ప్రేమతో పేపర్లో పెట్టిచ్చే మా జిలేబి మాబు మాధుర్యం!!"

 నేను తేరుకొనేలోపే డబ్బలోంచి తీసుకో అని జిలెబిచుట్ట చేతికిచ్చ !!

జిలేబి కోసం మేము పడ్తండే ఆరాటం గుర్తొచ్చి నవ్వొచ్చ అదెట్లంటే!!

"పుయ్యూ పుయ్యూ...మని సాయిబు వచ్చాండ!!

నాయన జోబిలో లెక్కకు చిల్లు పడ్తండ!!

అమ్మ కాపిపొడి డబ్బాలో దాచిపెట్టిన రూపాయిలు మాయమయితాండ!!

కల్లాలలో చేనిక్కాయలు తరుగుతాండ!!

పాత సిల్వర్ సెమ్ములు,తపాల్లు కనపరాకుండా పోతండ!!

అబ్బ తాగిన మందు సీసాలు మాబు యురియా సంచిలో పడతాండ!!

పగిలిన ప్లాస్టిక్ పైపులు మా చిరుతిండిగా మార్తాండ!!

చెన్లలో యిరిగిన సిల్వర్ తంత్య జిలేబి రూపంలో మా చేతికి వచ్చాండ!!

పుయ్యూ పుయ్యూ...మని సాయిబు వచ్చాండ!!  
   కమ్మని జిలేబి మాకిచ్చండ!!

అట్లా సాయిబు యిచ్చిన జిలేబి చుట్ట తిని మరొక 20 రూపాయల్ది పేపర్లో కట్టిచ్చుకోని దావుంటా తింటాకు వొచ్చిమి నేను నా బామ్మర్ది!!!

 

(*మైత్రేయ మురళీక్రిష్ణ,  కవి, రచయిత, అనంతపురం)