విశాఖపట్నం: ఉత్తర భారతదేశం మీదుగా పయనిస్తున్న వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ నుంచి మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇంకా కోస్తా తీరం వెంబడి అధిక పీడనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తాపైకి ఆగ్నేయం, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. దీంతో ఉత్తర కోస్తాలో మంగళవారం అనేకచోట్ల ఆకాశం మేఘావృతమైంది.

read more  మంచు కురిసింది..ప్రకృతి మురిసింది...

అయితే దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మాత్రం ఎండ పెరగడంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.