సంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణలో భాగంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దుష్ప్రచారం చేస్తూ కొందరు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండల బిజెపి అధ్యక్షులు డి. నగేష్ ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందకు ఈ ఎన్‌ఆర్‌సి  చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ ఎంఐఎం పార్టీ నాయకులు అసదుద్దిన్ ఓవైసీ, అక్బరుద్దిన్ ఓవైసీలు కుటిల రాజకీయాలకు పాల్పడుతూ రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇప్పటివరకు మైనారీటీలను తప్సుదారి పట్టించిన ఈ ఓవైసీ బ్రదర్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చిచ్చు రాజేస్తున్నారని నగేష్ మండిపడ్డారు. ఎన్‌ఆర్సి కి వ్యతిరేకంగా  ఇదివరకే  నిజామాబాద్ లో సభ నిర్వహించిన ఎంఐఎం తాజాగా సంగారెడ్డి జిల్లాలో కూడా నిర్వహించిందని... ఇలా మైనారిటీలకు రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలన్నది ఓవైసీ సోదరుల వ్యూహంగా కనిపిస్తోందని ఝరాసంఘం మండలాధ్యక్షుడు ఆరోపించారు. 

ఇప్పటికే జిల్లా కేంద్రం సంగారెడ్డిలో చిచ్చు రాజేయడానికి ప్రయత్నించిన ఎంఐఎం జహీరాబాద్ ప్రాంతంలో కూడా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ అశాంతిని సృష్టిస్తోందన్నారు. ఎన్ఆర్‌సి కి వ్యతిరేకంగా ఓవైసీ సోదరులు చేస్తున్న కుట్రలను నియోజకవర్గ ప్రజలకు వివరించేందుకు బిజెపి జాతీయ ఐటీ సెట్ కోకన్వినర్ జంగం గోపి ఆద్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఝరాసంఘం మండలాధ్యక్షుడు నగేష్ తెలిపారు. 

హిందు ముస్లీం బాయీ బాయీ అన్న పెద్దల మాటలను నిజమేనా అన్నట్లుగా ఝరాసంఘం మండలంలో హిందూ ముస్లీంలు కలిసి జీవిస్తున్నారని... వారిమధ్య చిచ్చు పెట్టెందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు.  ఖబర్దార్ ఓవైసీ....తమ ప్రాంతంలో అడుగుపెట్టి ఇలాంటి కుటిల రాజకీయాలు చేస్తే ఊరుకోబోమని నగేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.