Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంక రెడ్డి కేసు: చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

ప్రియాంక రెడ్డి ఘటనకు నిరసనగా శనివారం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేశారు. చిలుకూరు బాలాజీ ఆలయం ఎదుట భక్తులతో మహా ప్రదక్షణ చేయించారు. మహిళలను రక్షించుకుందామంటూ నినాదాలు చేశారు.

Priyanka Reddy Murder: Chilikuru Balaji Temple closed
Author
Chilkur Balaji Temple, First Published Dec 1, 2019, 6:47 AM IST

హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనకు నిరసనగా శనివారంనాడు రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసేశారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి 20 నిమిషాల పాటు ప్రదక్షణలు, దర్శనాలను పూర్తిగా నిలిపేశారు. ఆ తర్వాత ఆలయం ఎదుట భక్తులతో మహా ప్రదక్షణ చేయించారు. 

రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీజాతిని రక్షిద్దాం అంటూ భక్తులు పెద్ద పెట్టున నినాలాదు చేస్తూ భక్తులు మహాప్రదక్షణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రంజరాజన్ మాట్లాడారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. 9 నెలల పాప నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు, ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: ప్రియాంక రెడ్డి కేసు: ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్, గోడ కూల్చివేత

దేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని రంగరాజన్ చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై నలుగురు కీచకులు అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios