Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో మోదీతో... చార్మినార్ లో ఓవైసీతో...: కేసీఆర్ పై మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా ఎన్నార్సీ, ఎన్నార్పీ, సీఎఎ లపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ బిజెపి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతను తీసుకుంది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ లో అవగాహన సదస్సు నిర్వహించారు.  

NRC Awareness Meeting at Zaheerabad
Author
Zaheerabad, First Published Jan 10, 2020, 8:55 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగులుమార్చడంలో దిట్ట అని బిజెపి అధికార ప్రతినిధి మురళీధర్ రావు ఆరోపించారు. అందువల్లే డిల్లీకి వెళ్లినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే ఆయన హైదరాబాద్ కు వస్తే ఓవైసీ సోదరులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే రకమన్నారు. ఆయన రాజకీయ లబ్దికోసం ఎంతకయినా తెగిస్తారని మురళీధర్ రావు మండిపడ్డారు. 

దేశవ్యాప్తంగా సీఎఎ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ లపై వివాదం కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర  ప్రజల్లో వీటిపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బిజెపి చేపట్టింది. ఈ క్రమంలోనే బిజెపి జాతీయ ఐటీ సెల్ కో కన్వినర్ జంగం గోపి సారథ్యంలో సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ పట్టణంలో అవగాహన సభ జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీధర్ రావు ఈ చట్టాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, మజ్లీస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎంఐఎం జేబులో మనిషంటూ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా వున్న ప్రతిపక్ష పార్టీలు, జెండాలు వేరు కానీ డీఎన్ఎ మాత్రం ఒకటేనన్నారు. బిజెపి అధికారంలో లేనప్పుడు తన్నుకున్నవారందరూ ఇప్పుడు ఒక్కటయ్యారని తెలిపారు. 

తెలంగాణ గ్రామాల్లో బిజెపి, టీఆర్ఎస్ ఒకటే అంటున్నారని... కానీ కేసీఆర్ రంగులు మార్చే వ్యక్తి అని వారు గ్రహించలేకపోతున్నారని అన్నారు. డిల్లీలో తన అవసరం కోసం మోదీతో, ఆ తర్వాత తెలంగానలో మైనారిటీల ఓట్ల కోసం ఓవైసీ కలుస్తారని అన్నారు. అయితే అతడు  ఎప్పటికీ బిజెపికి మిత్రుడు కాదని... ఎంఐఎం జేబులోని మనిషేనని అన్నారు.  

 బిజెపి నాయకులకు పార్టీ అధికారంలో వున్నా, లేకున్నా దేశంపై ప్రేమ వుంటుందన్నారు. శాంతియుతంగా సీఎఎకు వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేయవచ్చు కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ద్వంసం చేయొద్దని మురళీధర్ రావు సూచించారు.

ప్రస్తుతం దేశంలో వున్న 130 కోట్ల మంది భారతీయులేనని.. వీరికోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఖాసీం రజ్వీ వారసులయిన ఎంఐఎం, టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు భారత్ మాతాకి జై అనడానికి వెనుకాడతారని... వీరు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా  వుందన్నారు.
  
జహిరాబాద్ లో  గత అసెంబ్లీ ఎన్నికల్లో జంగం గోపి సారథ్యంలో బిజెపి పార్టీ అద్భుతంగా పోరాడిందని... అదే స్పూర్తిని కొనసాగించాలని మురళీధర్ రావు సూచించారు. పక్కనున్న కర్ణాటకలో బిజెపి అధికారంలో వుందని... అది తెలంగాణకు రావాలంటే వయా జహిరాబాద్ మీదుగానే రావాలని చమత్కరించారు. అలా బిజెపిని అధికారంలోకి తీసుకురావాలంటూ ముందుగా జహిరాబాద్ లోని కార్యకర్తలు కష్టపడాలని మురళీధర్ రావు సూచించారు.  

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ అసెంబ్లీ ఇంచార్జి జంగం గోపి మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం గురించి వివరించారు. ఈ సందర్భంగా జహిరాబాద్ ప్రాంతంలో హిందువులంతా మరింత సంఘటితం కావాల్సిన అవసరం వుందని సూచించారు.  ఆ దిశగా ప్రతిఒక్క బిజెపి కార్యకర్త పనిచేయాలని గోపి సూచించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios