అక్టోబర్ 15 రైతు సంక్షేమానికి రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన రోజన్నారు  వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు. కనివీని ఎరుగని రీతిలో  రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్  ఈ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారన్నారు. కాకినాడలో ఏర్పాటు  చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి సిఎం జగన్ ఇచ్చిన హామీని    నెరవేర్చానున్నారు, అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఇస్తామన్న హామీని ముందుగానే అమలు చేస్తుమని  తెలిపారు. 


వైఎస్సార్ రైతు భరోసా పథకం దేశంలోనే ఓ సంచలనం కాబోతోందన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో సీఎం వైఎస్ జగన్.. రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం జగన్  ఫాలో అవుతున్నారనన్నారు మంత్రి కన్నాబాబు. అయితే టీడీపీ నాయకులు   రైతు భరోసా పథకంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు  సుమారు రూ.84 వేల కోట్ల ఉన్న రుణాలను రూ.24 వేల కోట్లకు కుదించారన్నారు.
రుణాలు మాఫీ కోసం తీసుకున్న రుణాలను చంద్రబాబు దారి మళ్లించారని ఆరోపించారు.


వైసీపీ అధికారంలోకి  వస్తే  రైతులకు  నేరుగా రూ.12,500 పెట్టుబడి సాయంగా ఇస్తామని హామీ ఇచ్చాం. దానిపై ప్రతిపక్షాలు అనవసర  ఆరోప ణలు చేస్తున్నాయని 
విమర్శించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6,500 కలిపి రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైదంటూ అసత్య ఆరోపణలు  చేస్తున్నాయని వాపోయారు. ఈ ఆరోపణలపై  మంత్రి కన్నబాబు తీవ్రంగా స్పందించారు.