అనంతపురం: అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో బుధవారం నాడు ఉదయం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో  నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అనంతపురం జిల్లా నంబులపూలకుంటలోని సోలార్ పవర్ ప్లాంట్‌లో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు.