సీపీఎం నేత, మాజీ ఎమ్మల్యే సున్నం రాజయ్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను బస్సు ఢీకొట్టింది.

సోమవారం సాయంత్రం వీఆర్ పురం నుంచి భద్రాచలం వస్తున్న ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేట్ డ్రైవర్ నడుపుతున్నారు. ఈ క్రమంలో రాజయ్య ప్రయాణిస్తున్న బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఆయన పక్కనే ఉన్న బురదగుంటలో పడిపోయారు.

వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను రక్షించారు. అదృష్టవశాత్తూ రాజయ్య స్వల్పగాయాలతోనే బయటపడ్డారు. 

మరోవైపు ఆర్టీసీలో కొత్త నియామాకాలపై కేసీఆర్ స్పందనపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది ఉద్యోగులను ఒకేసారి తొలగిస్తామనడం అప్రజాస్వామికమని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పోరాడాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు.