కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల అత్యాచారానికి గురయిన చిన్నారిని ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి పరామర్శించారు. కాకినాడ జిజిహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి అండగా వుంటామని హామీ ఇచ్చారు. 

మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ ఘటనలో  కూడా పోలీసులు తక్షణమే స్పందించారని అన్నారు. నిందితులైన మైనర్లకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతోందనియ తెలిపారు. 

read more  బాలికకు వేధింపులు.. కాపాడాల్సిన తండ్రే రాక్షసుడికి కాపలాకాసి..

చిన్నతనంలోనే అబ్బాయిలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడటానికి కారణం స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లే కారణమన్నారు. ఈ అఘాయిత్యానికి కూడా ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోందన్నారు. కాబట్టి తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ దూరంగా ఉంచాలని సూచించారు. అలాగే  ప్రభుత్వం కూడా  పోర్న్ సైట్స్ ను బ్యాన్ చేయాలని రాజ్యలక్ష్మి  డిమాండ్ చేశారు.