Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: ఈ ఏడాది ఎక్కువ మంది లైక్ చేసిన ట్వీట్ అదే.. అందులోనూ విరాట్ దే క్రేజ్..

Most Liked Tweet In 2021: ఇండియాలో స్పోర్ట్స్ పర్సన్స్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆటగాడు విరాట్ మాత్రమే.  ఇప్పుడు ట్విట్టర్ ఇండియా కోహ్లీ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే...!

Virat Kohli s post on daughter Vamika s birth becomes the most liked tweet of 2021
Author
Hyderabad, First Published Dec 9, 2021, 3:15 PM IST

టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీని అందరూ కింగ్ కోహ్లీ  అని పిలుస్తారు. ఫామ్  తో సంబంధం లేకుండా విరాట్ ను అభిమానించేవాళ్లు లక్షల్లో ఉన్నారు. ఆన్ ది ఫీల్డ్ లోనే గాక ఆఫ్ ఫీల్డ్ లో కూడా చలాకీగా ఉండే విరాట్.. నిత్యం తనకు సంబంధించిన విషయాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. ఇండియాలో స్పోర్ట్స్ పర్సన్స్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆటగాడు విరాట్ మాత్రమే. కోహ్లీ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. ఈ ఏడాది భారత్ లో అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్ విరాట్ చేసింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే... 

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ  లు ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. 2021 జనవరి 11న అనుష్క శర్మ.. వామికకు జన్మనిచ్చింది. ఇద్దరి జీవితంలో ఎంతో అమూల్యమైన ఈ సందర్భం కోసం కోహ్లీ.. ఏకంగా ఆసీస్ సిరీస్ నుంచి  మధ్యలోనే తిరిగొచ్చాడు. వామిక పుట్టిన తర్వాత విరాట్ చేసిన ట్వీట్ ఈ ఏడాది భారత్ లో ఎక్కువ మంది లైక్ చేసిన ట్వీట్ గా నిలిచింది. 

 

ఈ మేరకు ట్విట్టర్ ఇండియా ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది. కోహ్లీకి పాప పుట్టిందని తెలియగానే  దేశవ్యాప్తంగా బాలీవుడ్ ప్రముఖులు, క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు, రాజకీయ నాయకులు.. ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో కోహ్లీ చేసిన ట్వీట్ కు ఏకంగా 5.4 లక్షల లైకులు వచ్చాయి. ఇదే విషయమై ట్విట్టర్ ఇండియా స్పందిస్తూ.. ‘కోహ్లీ చేసిన ఈ ట్వీట్  2021 ఏడాదికి గాను అత్యధిక మంది  యూజర్లు లైక్ కొట్టిన ట్వీట్ గా నిలిచింది..’ అని రాసుకొచ్చింది.  

దీంతో పాటు ఈ ఏడాది ఇండియాలో  కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పలు హృదయ విదారకర దృశ్యాలు ఎంతో మందిని కదిలించాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ కూడా చలించిపోయారు.  దానిని చూసిన ఆయన  తనవంతుగా కొంత సాయం కూడా చేశారు.  ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్..2021 లో  అత్యధిక మంది రీట్వీట్ చేసిన ట్వీట్ గా నిలిచిందని ట్విట్టర్ ఇండియా వెల్లడించింది.

 

ఇక #కోవిడ్ 19, #రైతు ఉద్యమం, #టీమిండియా, #టోక్యో 2020, #ఐపీఎల్ 2021, #ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, #దివాళి, #మాస్టర్ సినిమా, #బిట్ కాయిన్, #పర్మిషన్ టు డాన్స్ లు ఈ ఏడాది ఎక్కువగా వాడిన హ్యాష్ ట్యాగ్ (#) లుగా నిలిచాయి.

 

ఈ మేరకు ‘ఓన్లీ ఆన్ ట్విట్టర్ : గోల్డెన్ ట్వీట్స్ ఆఫ్ 2021 రిపోర్డు’లో ట్విట్టర్ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios