టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఖేల్ ఖతమైంది. ఇక ముందు పంత్ కి జట్టులో చోటు దక్కే అవకాశం కనపడటం లేదు. ఇప్పటి వరకు జట్టులో పంత్ చోటు దక్కించుకుంటూ వస్తున్నాడు. జట్టులో చోటు దక్కిన ప్రతిసారి తన ఆటతో అటు జట్టుని.... ఇటు అభిమానులను నిరాశపరిచేవాడు. బ్యాటింగ్ లోనూ, వికెట్ కీపింగ్ లోనూ రెండింటిలోనూ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో.. పంత్ ని విపరీతంగా ట్రోల్స్ చేసేవారు. ధోనీ లేకపోవడంతో.. వేరే ఆప్షన్ లేక పంత్ ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే... ఇప్పుడు టీమిండియాకి సరికొత్త వికెట్ కీపర్ దొరికాడు.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పంత్ కి గాయంతో మ్యాచ్ కి దూరమైతే ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్ కి అప్పగించారు. అయితే తనకు అప్పగించిన బాధ్యతలను కేఎల్ రాహుల్ సద్వినియోగం చేసుకున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు వికెట్ కీపింగ్ లో తనదైన ముద్ర వేసి జట్టు గెలుపు కు సహకరించాడు. దీంతో అందరి ఆశలు ఇప్పుడు కేఎల్ రాహుల్ పైకి మళ్లాయి.

ఇదే విషయంపై తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ సక్సెస్‌ కావడంతో  పంత్ కి ద్వాసన తప్పదనే సంకేతాలను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇచ్చేశాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో కూడా కీపర్‌గా కేఎల్‌ రాహులే కొనసాగుతాడని కోహ్లి స్పష్టం చేశాడు. దీంతో.. పంత్ కొంతకాలం జట్టుకి దూరంగా ఉండాల్సిందేనని కోహ్లీ చెప్పకనే చెప్పాడు.

Also Read అందుకే ఓడిపోయాం: మూడో వన్డే ఫలితంపై ఆరోన్ ఫించ్...

.న్యూజిలాండ్‌ పర్యటనలో రాహుల్‌ను కీపర్ గా కొనసాగించాలని అనుకుంటున్నట్లు కోహ్లీ చెప్పాడు. ఆసీస్‌ సిరీస్‌లో రాహుల్‌ తనకిచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నాడని గుర్తు చేశారు.  అటు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుతో పాటు కీపర్‌గా కూడా తన పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించాడని మెచ్చుకున్నాడు.  రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతలతో అదనంగా మరొక బ్యాట్స్‌మన్‌ను తీసుకోవచ్చని కోహ్లీ భావిస్తున్నాడు. దాని వల్ల బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుందని కోహ్ల స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో వికెట్ కీపర్ గా తమకు రాహుల్ తప్ప మరో ప్రత్యామ్నాయం ఏమీ కనిపించడం లేదని చెప్పాడు.