Asianet News TeluguAsianet News Telugu

డేంజర్ జోన్ లో అమెరికా...లక్ష దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకట్టవేసేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులు నిర్మించాలని సైన్యంలోని ఇంజినీర్ల బృందాన్ని ట్రంప్ రంగంలోకి అదింపారు. ఇప్పటికే అన్ని మార్గాలను అన్వేషించి ఆచరణలోకి తెచ్చిన శ్వేత సౌధం.. ఆఖరి అస్త్ర్రంగా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ని కూడా అమల్లోకి తీసుకువస్తోంది.

US coronavirus cases top 100,000; Italy deaths rise
Author
Hyderabad, First Published Mar 28, 2020, 10:59 AM IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే చైనా, ఇటలీ దేశాలను దాటేసిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా.. అమెరికాలో మొత్తం లక్షకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు గుర్తించారు.

ప్రస్తుతం టాప్‌లో ఉన్న యూఎస్‌లో 1,04,142 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క శుక్రవారం ఏకంగా 17 వేల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక అమెరికాలో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న 300 మంది పైగా మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 1,695 చేరుకుంది.

Also Read కలకలం:బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్ లక్షణాలు...

కాగా, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగాన్‌, ఇల్లినాయిస్‌, ఫ్లోరిడాలోనూ వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే అక్కడ పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. దీనితో సుమారు 33 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇక డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీరి కోసం 2.2 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా.. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకట్టవేసేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులు నిర్మించాలని సైన్యంలోని ఇంజినీర్ల బృందాన్ని ట్రంప్ రంగంలోకి అదింపారు. ఇప్పటికే అన్ని మార్గాలను అన్వేషించి ఆచరణలోకి తెచ్చిన శ్వేత సౌధం.. ఆఖరి అస్త్ర్రంగా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ని కూడా అమల్లోకి తీసుకువస్తోంది.

దీనిని చాలా అరుదుగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి దానిని అమలులోకి తీసుకువచ్చారంటే.. పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios