కలకలం:బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్ లక్షణాలు

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు.

British PM Johnson tests positive for coronavirus

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు.బ్రిటన్ రాజు ఛార్లెస్ కు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినట్టుగా గుర్తించిన విషయం తెలిసిందే..


24 గంటలుగా తాను ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్టుగా ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. తాను స్వీయ నియంత్రణలో ఉన్నట్టుగా  ఆయన స్పష్టం చేశారు.కరోనాపై పోరాటం చేసే కార్యక్రమంలో ప్రభుత్వానికి నాయకత్వం వహించడం తనకు గర్వంగా ఉందని  బోరిస్ ప్రకటించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో తాను తన  బృందంతో పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. 24 గంటలుగా జ్వరం, జలుబుతో బాధపడ్డారు బోరిస్. దీంతో జాన్సన్ వైద్య పరీక్షలు నిర్వహించుకొన్నాడు.

Also read:ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజటివ్

ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన అధికారులు ధృవీకరించారు. రెండు రోజుల క్రితమే బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినట్టుగా గుర్తించారు. ఆయన భార్యకు కూడ కరోనా పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్ గా వచ్చింది.బ్రిటన్ రాణి ఎలిజబెత్  హోం క్వారంటైన్ లో ఉన్నారు.బ్రిటన్ రాజు చార్లెస్ దంపతులు స్కాట్లాండ్ లో హోం క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికా, ఇటలీతో పాటు స్పెయిన్ దేశాల్లో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి ప్రపంచంలోని సుమారు 201 దేశాల్లో వ్యాపించినట్టుగా నిపుణులు ప్రకటించారు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios