చేయాలన్న ప్రతిపాదన కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అతని సహచరులకు నచ్చలేదు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఒక నోట్ ఆర్బీఐ వెబ్ పెట్టడం కేంద్రానికి మరింత కోపం తెప్పించింది. కర్ణుని చావుకి కారణాలెన్నో కానీ, ఊర్జిత్ పటేల్ రాజీనామాకు అంతకన్నా ఎక్కువే కారణాలున్నాయి.

ఒకవేళ ఆర్బీఐ వద్ద గల రిజర్వు నిధులను కేంద్ర ప్రభుత్వానికి తరలిస్తే.. అత్యవసర సమయంలో విదేశాలకు చెల్లింపులకు నిధుల కొరత ఎదుర్కొంటే అధిగమించడానికి ఈ నిధులు ఉపకరిస్తాయి. 1991లో పీవీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేనాటికి దేశీయ అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. 

కాగా, ఊర్జిత్ పటేల్ రాజీనామాతో ఆర్బీఖి ఇప్పుడు అధినాయకుడు లేకుండా పోయాడు. కొత్త గవర్నర్ నియమించడానికి ప్రభుత్వం కొంత సమయం తీసుకోవచ్చు. ఈలోగా ఏం జరుగబోతున్నది? అన్నదానిపై ఉత్కంఠ నెలకొన్నది. 

సాధారణ పరిస్థితులే ఉంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తర్వాత నెంబర్ టూ స్థానంలో ఉన్న విరాల్ ఆచార్య తాత్కాలిక గవర్నర్ బాధ్యతలను చేపట్టాలి. కానీ కేంద్రంతో విభేదాలకు ఆయనే కేంద్ర బిందువు. దీంతో ఆచార్య కాకపోతే అతని తర్వాత సీనియర్ లేదా బయటి వ్యక్తులను తాత్కాలికంగా నియమిస్తుందా? అన్నది చూడాలి. 

మరోవైపు ఇటీవలే ఆర్థిక శాఖ కార్యదర్శిగా రిటైరైన హస్ముఖ్ అధియా పేరు ఊర్జిత్ స్థానంలో వినిపిస్తోంది. గవర్నర్ నియమించడం పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉంది. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవర్ని గవర్నర్ లేదా తాత్కాలిక గవర్నర్ నియమిస్తుందనేది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న.

ఊర్జిత్ పటేల్ రాజీనామా నేపథ్యంలో డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కూడా రాజీనామా చేశారన్న పుకార్లను రిజర్వ్ బ్యాంక్ ఖండించింది. విరాల్ ఆచార్య రాజీనామా చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, నిరాధారమని ఆర్బీఐ ప్రతినిధి తెలిపారు. రిజర్వ్ స్వయం ప్రతిపత్తిని కాపాడాలంటూ అక్టోబర్ 26న విరాల్ ఆచార్య ప్రసంగించినప్పటి నుంచి ఆర్థిక శాఖతో వివాదం పెరిగింది.

డిప్యూటీ గవర్నర్లలో సీనియర్ ఎన్ విశ్వనాథన్ తాత్కాలిక గవర్నర్ నియమించే అవకాశం ఉందని సమాచారం. 2016 జూలై 4న మూడేళ్ల కాలపరిమితితో ఆయన డిప్యూటీ గవర్నర్ నియమితులు అయ్యారు.

ఒకవేళ ఆయన నియామకం ఖారారైతే ఈ నెల 14న జరిగే ఆర్బీఐ బోర్డు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. గవర్నెన్స్, లిక్విడిటీ, ఎంఎస్ రుణ వితరణ వంటి కీలక అంశాలను చర్చించనున్నందున ఈ సమావేశానికి ప్రాముఖ్యత ఏర్పడింది.

రిజర్వ్ బ్యాంక్ లాంటి అతి ముఖ్యమైన సంస్థకు అధిపతి లేకుండా ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదని భావిస్తున్న ప్రభుత్వం.. ఊర్జిత్ స్థానాన్ని భర్తీ చేయడానికి వెంటనే ప్రక్రియను ప్రారంభించనున్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది.

కాగా, కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో అత్యున్నత కమిటీ ఊర్జిత్ పటేల్ వారసున్ని ఎంపిక చేయనుంది. కమిటీ సూచించే పేరుపై కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.

ఈ కమిటీలో కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హాతోపాటు, ప్రధాన మంత్రికి అదనపు ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, మరో ముగ్గురు సభ్యులు ఉంటారు. విశ్వనాథన్ విరాల్ ఆచార్య, బీపీ కనుంగు, ఎంకే జైన్ కూడా డిప్యూటీ గవర్నర్లుగా వ్యవహరిస్తున్నారు.