Asianet News TeluguAsianet News Telugu

మహిళలకు వర్క్ ఫ్రం హోం, ఫ్లెక్సిబుల్ పనిగంటలను కల్పించాలి పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపు..

పరిశ్రమల్లో నైపుణ్యం పెంచేందుకు లేబర్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్యం పెంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దాని కోసం వర్క్ ఫ్రం హోం, ఫ్లెక్సిబుల్ అవర్స్ ద్వారా మహిళలకు ఉద్యోగాలు విరివిగా కల్పించాలని మోదీ సూచించారు. 
 

PM Modi calls on industries to provide work from home and flexible working hours for women
Author
First Published Aug 26, 2022, 10:13 AM IST

మహిళలకు వర్క్ ఫ్రం హోం, ఫ్లెక్సిబుల్ పనిగంటలను కల్పించాలి పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపు..

PM Modi calls on industries to provide work from home and flexible working hours for women

పరిశ్రమల్లో నైపుణ్యం పెంచేందుకు లేబర్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్యం పెంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దాని కోసం వర్క్ ఫ్రం హోం, ఫ్లెక్సిబుల్ అవర్స్ ద్వారా మహిళలకు ఉద్యోగాలు విరివిగా కల్పించాలని మోదీ సూచించారు. 


కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పనిగంటలను ప్రవేశ పెట్టేందుకు ఆలోచన చేస్తోంది. ఈ మేరకు పరిశ్రమలకు మహిళల కోసం ఫ్లెక్సిబుల్ అవర్స్ ప్రాతిపదికన పనిగంటలను ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతేకాదు మహిళలను దేశ ఆర్థికాభివృద్ధిలోనూ, మానవ వనరుల్లోనూ ప్రాతినిధ్యం పెరిగేందుకు ఈ చర్య చేపట్టాలని ప్రధాని మోదీ తెలిపారు. ముఖ్యంగా మహిళల కోసం వర్క్ ఫ్రం హోం ( ఇంటి వద్ద నుంచే పని) కల్పించేలా పరిశ్రమలు, సంస్థలు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 

వర్క్ ఫ్రం హోం, ఫ్లెక్సిబుల్ పనిగంటలను కల్పించడం ద్వారా మొత్తం పని చేసేవారి సంఖ్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని తెలిపారు. ఇప్పటికే నైపుణ్యం కొరత ఎదుర్కొంటున్న పరిశ్రమలకు మహిళా భాగస్వామ్యం పెంచడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చని సైతం తెలిపారు. 2021 సంవత్సరం నాటికి పని చేసే వర్క్ ఫోర్స్ లో మహిళల ప్రాతినిధ్యం 25 శాతంగా ఉందని పేర్కొన్నారు. 

కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రి జాతీయ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో మహిళలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని అన్నారు.

దేశ.ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో తమ పాత్ర పోషించినందుకు, దేశంలోని కార్మికులను సమానంగా ప్రశంసించారు. దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కార్మికుల సంక్షేమం కోసం  కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. అసంఘటిత కార్మికుల సహకారాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొనియాడారు. ప్రభుత్వం వారి పట్ల అవగాహన కలిగి ఉందని హామీ ఇచ్చారు.

అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఇ-శ్రమ్ పోర్టల్‌ను రూపొందించిందని ప్రధాని మోదీ ప్రస్తావించారు.

తక్కువ సమయంలోనే 28 కోట్ల మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.  ఒక అంచనా ప్రకారం అసంఘటిత రంగంలోని కార్మికుల సంఖ్య దాదాపు 38 కోట్లుగా తేలిందని తెలిపారు. ఇది ప్రపంచంలోనే ఏ ఇతర దేశంలోనూ ఈ స్థాయిలో కార్మికుల సంఖ్య లేదని గుర్తు చేశారు. వీరందరి సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు.  

ఇ-శ్రమ్ పోర్టల్ దేశంలోని శ్రామిక శక్తిలో ఎక్కువ భాగం ఉన్న అసంఘటిత రంగంలోని కార్మికుల డేటాను సేకరించే వేదిక అని. సంక్షేమ విధానాలు సంబంధిత సమస్యలను సిద్ధం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డేటా సహాయం చేస్తుందని తెలిపారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు వారి సమస్యలను సమర్ధవంతంగా సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ పోర్టల్స్ ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. 

కోవిడ్ మహమ్మారి కష్టకాలంలో EPFO ​​(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) తీసుకున్న చర్యలు కార్మికులకు సహాయాన్ని అందించాయని ఆయన పేర్కొన్నారు.

కార్మికులు, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా, పాత కార్మిక చట్టాలను ప్రభుత్వం తొలగిస్తున్నదని మోదీ అన్నారు. ఈ  29 కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోడ్‌లుగా సరళీకృతం చేశామని. తద్వారా మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లు మారాయన్నారు.

“మొదటి, రెండవ, మూడవ పారిశ్రామిక విప్లవాల ద్వారా  అవకాశాలను దేశం కోల్పోయింది. నాల్గవ విప్లవం ద్వారా లభించిన అవకాశాన్ని వదులుకోలేము, ”అని మోడీ అన్నారు, ప్రపంచం వేగంగా మారుతున్నదని అన్నారు.

మెరుగైన విధానాలను రూపొందించడానికి కార్మికుల సంక్షేమం కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని సృష్టించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios