MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దేవర-గేమ్ ఛేంజర్ స్టోరీ ఒకటేనా? రెండు చిత్రాల మధ్య ఉన్న ఈ పోలికలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

దేవర-గేమ్ ఛేంజర్ స్టోరీ ఒకటేనా? రెండు చిత్రాల మధ్య ఉన్న ఈ పోలికలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్... దేవర-గేమ్ ఛేంజర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అయితే ఈ రెండు చిత్రాల కథ ఒకటే అని తెలుస్తుంది. అలాగే మైండ్ బ్లాక్ చేసే పోలికలు ఈ రెండు చిత్రాల మధ్య ఉన్నాయి.  

3 Min read
Sambi Reddy
Published : May 01 2024, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ ఫేమ్ రాబట్టారు ఎన్టీఆర్, రామ్ చరణ్. దర్శకుడు రాజమౌళి తన సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తూ భారీ విజయం సొంతం చేసుకున్నాడు. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భీమ్-రామ్ పాత్రల్లో ఎన్టీఆర్-చరణ్ మెస్మరైజ్ చేశారు. 

210

ఇక ఆర్ ఆర్ ఆర్ హీరోల నుండి వస్తున్న దేవర-గేమ్ ఛేంజర్ చిత్రాలపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్స్, ప్రోమోలు విడుదలయ్యాక ఆ అంచనాలు మరో స్థాయికి చేరాయి. కాగా దేవర-గేమ్ ఛేంజర్ చిత్రాల కథ ఒకటే అని తెలుస్తుంది. అలాగే ఈ రెండు చిత్రాల మధ్య మైండ్ బ్లాక్ చేసే కొన్ని పోలికలు ఉన్నాయి. 

310
Devara and Game Changer

Devara and Game Changer

డ్యూయల్ రోల్

దేవర మూవీ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా గేమ్ ఛేంజర్ లో సైతం రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. మరొక కామన్ పాయింట్ తండ్రి కొడుకుల పాత్రల్లో దేవర లో ఎన్టీఆర్, గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ కనిపించనున్నారు. రెండు సినిమాల్లో పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. 

410

స్టోరీ 


దేవర-గేమ్ ఛేంజర్ రివేంజ్ డ్రామా జోనర్లో తెరకెక్కుతున్న చిత్రాలు. దేవర కథ విషయానికి వస్తే... తండ్రి దేవ పేదల కోసం పాటు పడే వ్యక్తి. కష్టపడి సీపోర్ట్ నిర్మిస్తాడు. దానిపై ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రధాన విలన్ దేవ(ఎన్టీఆర్)ని చంపేస్తాడు. దేవ కొడుకైన వర(ఎన్టీఆర్)... తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడంతో పాటు సీపోర్టును హస్తగతం చేసుకుంటాడు. ప్రచారం లో ఉన్న కథ ఇది. 

 

510

గేమ్ ఛేంజర్ కథ కూడా దీనికి చాలా దగ్గరగా ఉంది. నేపథ్యం మారినప్పటికీ గేమ్ ఛేంజర్ సైతం రివేంజ్ డ్రామానే. నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడైన రామ్ చరణ్ ఒక పార్టీని స్థాపించి అధికారంలోకి తెస్తాడు. అధికార దాహంతో పక్కనే ఉన్న నమ్మిన బంటు వెన్నుపోటు పొడుస్తాడు. వంచనకు గురైన ఆ తండ్రి కొడుకు రామ్ చరణ్ ఐ ఏ ఎస్ అధికారి అవుతాడు. తన తండ్రిని వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న వారిపై రివేంజ్ తీర్చుకుంటాడట. 

610
Devara and Game Changer

Devara and Game Changer

గేమ్ ఛేంజర్ కథ కూడా దీనికి చాలా దగ్గరగా ఉంది. నేపథ్యం మారినప్పటికీ గేమ్ ఛేంజర్ సైతం రివేంజ్ డ్రామానే. నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడైన రామ్ చరణ్ ఒక పార్టీని స్థాపించి అధికారంలోకి తెస్తాడు. అధికార దాహంతో పక్కనే ఉన్న నమ్మిన బంటు వెన్నుపోటు పొడుస్తాడు. వంచనకు గురైన ఆ తండ్రి కొడుకు రామ్ చరణ్ ఐ ఏ ఎస్ అధికారి అవుతాడు. తన తండ్రిని వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న వారిపై రివేంజ్ తీర్చుకుంటాడట. 

710
Devara and Game Changer

Devara and Game Changer

శ్రీకాంత్ 

గేమ్ ఛేంజర్- దేవర చిత్రాలకు ఉన్న మరొక పోలిక నటుడు శ్రీకాంత్. ఈ రెండు చిత్రాల్లో శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. కథను మలుపు తిప్పేదిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. గేమ్ ఛేంజర్ లో ఆయన విలన్ అని తెలుస్తుండగా... దేవర లో పాత్ర పై స్పష్టత లేదు. 

810
Devara and Game Changer

Devara and Game Changer

పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ 

దేవర మూవీకి ప్రధాన ఆయువు పట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటున్నారు. తండ్రి ఎన్టీఆర్ పాత్ర చాలా వైల్డ్ గా డిజైన్ చేశాడట దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ పేరు వింటేనే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేలా ఈ రోల్ ఉంటుందని సమాచారం. యాక్షన్ బ్లాక్స్ గూస్ బంప్స్ రేపేవిగా ఉంటాయట.

శంకర్ సినిమాలకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్రాణం అని చెప్పాలి. జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు చిత్రాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి. గేమ్ ఛేంజర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. ప్రజలకు మంచి చేయాలని రాజకీయ పార్టీ స్థాపించిన నీతిగల నాయకుడు పాత్రలో రామ్ చరణ్ ఎపిసోడ్స్ అలరిస్తాయట. 

910
Devara and Game Changer

Devara and Game Changer

బాలీవుడ్ భామలు 

గేమ్ ఛేంజర్- దేవర చిత్రాల్లో బాలీవుడ్ భామలు నటిస్తున్నారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది.  ఎన్టీఆర్ తో ఆమెకు మొదటి చిత్రం. రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ఇది రెండవ చిత్రం. 

1010


బడ్జెట్ 

దేవర చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 300-350 కోట్లు అని సమాచారం. అలాగే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని కూడా దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇవి దేవర-గేమ్ ఛేంజర్ చిత్రాల మధ్య గల ఆసక్తికర పోలికలు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది భారీ విజయం సాధిస్తుందో చూడాలి.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
బిగ్ బాస్ డబుల్ గేమ్.. సుమన్ కోసం దివ్య ను బలి చేశారా..? రసవత్తరంగా మారిన రియాల్టీషో..
Recommended image2
50 ఏళ్ల వయసులో చెమటలు కక్కుతూ.. డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్న దళపతి విజయ్
Recommended image3
500 కోట్ల ఆస్తి ఉన్న దీపికా పదుకొణె ఏం చదువుకుందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved