మధ్యతరగతి, సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ మరోసారి వరాలు ప్రకటించింది. వచ్చేవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని ఐదు శాతానికి, చౌక ఇళ్లపై జీఎస్టీని ఒక్కశాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇది విప్లవాత్మక నిర్ణయం అని స్థిరాస్థి పరిశ్రమ పేర్కొంది.