Asianet News TeluguAsianet News Telugu

బిల్ గేట్స్‌కు షాక్: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్ భారత బిలియనీర్ ముకేశే

  •  ప్రపంచ కుబేరుల్లో రెండో వ్యక్తిగా నిలిచిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు షాక్
  • ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ రెండో స్థానంలో నిలిచారు.
  • భారతదేశంలో ముకేశ్ అంబానీ, విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ కుబేరులు మొదటి వరుసలో ఉన్నారు.
Bill Gates no longer 2nd richest person in world; Jeff Bezos remains on top
Author
New Delhi, First Published Jul 18, 2019, 5:17 PM IST

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భారత్‌లో అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని మరోమారు పదిల పరుచుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్‌ డాలర్లు. ప్రపంచ వ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచారు. 

 

ముకేశ్ అంబానీ తర్వాత స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ 20.5 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన 48వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ శివ నాడార్‌ 92 స్థానంలో, కొటాక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కొటాక్‌ 96స్థానంలో నిలిచారు.

 

అంతర్జాతీయంగా ఆమెజాన్‌ సీఈవో జెఫ్‌బెజోస్‌ అత్యంత ధనవంతుడి స్థానాన్ని తిరిగి పొందారు. ఇటీవల బ్లూంబర్గ్ బిలియనీర్‌ ఇండిక్స్‌ విడుదల చేసిన జాబితాలో ఈయన తొలి స్థానంలో నిలిచారు. అయితే ఇక అమెజాన్‌ చీఫ్‌ బెఫ్‌ బెజోస్‌ తన భార్య మెకంజీ బెజోస్‌కు భారీగా భరణం సమర్పించుకున్నా 125 బిలియన్‌ డాలర్లతో తొలిస్థానంలో నిలిచారు. 

 

బెజోస్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు ఈ సారి షాక్‌ తగిలింది. బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ రెండో స్థానంలో నిలిచారు. 

 

ఆర్నాల్ట్ మొత్తం ఆస్తుల విలువ 108 బిలియన్ డాలర్లు కాగా, గేట్స్‌ ఆస్తుల మొత్తం 107 బిలియన్‌ డాలర్లుగా ఉంది. బిల్‌గేట్స్‌ తన సంపదలోని 35 బిలియన్‌ డాలర్లను గేట్స్‌ అండ్‌ మిలిందా సంస్థకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బిల్ గేట్స్ సంపద 107 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

 

ఇక ఆర్నాల్డ్‌ 2019లో ఇప్పటి వరకు 39 బిలియన్‌ డాలర్లు సంపాదించారు. ఈ జాబితాలో పేర్కొన్న టాప్‌ 500 మంది ధనికుల్లో ఒక ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ఆర్నాల్ట్‌ తొలిస్థానంలో నిలిచారు.

 

అమెజాన్ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌తో విడాకులు తీసుకుని భరణం పొందిన మెకంజీ ధనిక మహిళల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. మొత్తంగా తీసుకుంటే ఈమె 22వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా ఫ్రాంకోయిస్‌ నిలిచారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios