Asianet News TeluguAsianet News Telugu

టాటా అంటే ఒక బ్రాండ్.. తర్వాతే ఎల్ఐసీ.. ఇన్ఫీ

టాటా సన్స్ గ్రూప్ అంటే కొన్ని సంస్థల సమ్మేళనం కాదని ఒక బ్రాండ్ అని మరోసారి రుజువైంది.

At USD 19.6 billion, Tatas most valued brand while LIC and Infosys follow
Author
New Delhi, First Published Jul 17, 2019, 4:21 PM IST

భారత్‌లో అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో వరుసగా రెండో ఏడాదీ టాటా గ్రూప్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ కీర్తి కిరీటాన్ని టాటా గత కొన్నేళ్లుగా నిలుపుకొంటోంది. యునైటెడ్ కింగ్‌డం చెందిన బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఆఫ్‌ ది నేషనన్స్‌ నిర్వహించిన లీడింగ్‌ 100 బ్రాండ్స్‌ సర్వే ఈ సంగతి చెప్పింది.

టాటాల బ్రాండ్‌ అత్యంత వేగంగా పెరిగిందని ఈ సర్వే తేల్చింది. టాటాల బ్రాండ్‌ విలువ ఒక్క ఏడాదిలో 37శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. 2019లో దీనివిలువ 19.55 బిలియన్‌ డాలర్లుగా తేల్చింది. 2018లో తొమ్మిది శాతం పెరిగి 14.23 బిలియన్‌ డాలర్లుగా తేల్చింది. 

2018లో టాటా గ్రూప్‌ బ్రాండ్‌ విలువ 14.23 బిలియన్ల డాలర్లు. దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గానే కాక.. అగ్రగామి-25 బ్రాండ్లలో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. వాహన, ఐటీ, ఉక్కు, రసాయనాల వంటి పలు రంగాల్లో ఈ బ్రాండ్‌ విస్తరించి ఉంది.

టాటా సన్స్ తర్వాత స్థానంలో జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ బ్రాండ్‌ విలువ 7.32 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలిపింది. ఎల్‌ఐసీ 4 స్థానాలను మెరుగు పర్చుకుంది. 22.8 శాతం వృద్ధితో బ్రాండ్‌ విలువను 7.32 బిలియన్‌ డాలర్లకు చేర్చుకుని జాబితాలో రెండో స్థానం పొందింది.  

ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ విలువ 7.7 శాతం వృద్ధితో 6.5 బిలియన్ డాలర్లకు చేరడంతో జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది. ఎస్‌బీఐ 34.4% వృద్ధితో 5.97 బిలియన్ డాలర్లకు, మహీంద్రా గ్రూప్‌ 35.5% వృద్ధితో 5.24 బిలియన్ డాలర్లకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 19% వృద్ధితో 4.84 బిలియన్ డాలర్లకు చేరి జాబితాలో వరుసగా నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. 

మహీంద్రా గ్రూప్‌ విలువ మాత్రం భారీగా పెరిగింది. గత ఏడాది ఈ జాబితాలో 12వ స్థానంలో ఉన్న ఆ సంస్థ ఈ సారి ఐదో స్థానానికి ఎగబాకడంతో బ్రాండ్‌ విలువ 5.24 బిలియన్‌ డాలర్లకు చేరింది. 

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ చాలా వేగంగా బ్రాండ్‌ విలువను కోల్పోయింది. బ్రాండ్‌ విలువలో ఏకంగా 28.1 శాతాన్ని కోల్పోయినా కూడా టాప్‌-10లో నిలబడ్డ ఏకైక కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌.

4.79 బిలియన్ డాలర్ల విలువతో ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక హెచ్‌సీఎల్ 4.64 బిలియన్ల డాలర్లలో, రిలయన్స్‌ 4.54 బిలియన్ డాలర్లతో, విప్రో 4 బిలియన్ డాలర్లతో ఆ తర్వాతీ ర్యాంకులకు చేరాయి.

ఇక బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలు తొలి 12 స్థానాల్లో స్థానాలు కాపాడుకున్నాయి. ఇక తొలి 100 బ్రాండ్లలో 14 స్థానాలు బ్యాంకులవే అంటే అతిశయోక్తి కాదు.

కోటక్‌ మహీంద్రా (23), యాక్సిస్‌ (26), బ్యాంక్ ఆఫ్ బరోడా (45), కెనరా బ్యాంక్ ‌(58), బ్యాంక్ ఆఫ్ ఇండియా (68) స్థానాల్లో నిలిచాయి. మరో వైపు అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌ మాత్రం 65 శాతం క్షీణతతో 559 మిలియన్‌ డాలర్ల వద్ద నిలిచి జాబితాలో 28 స్థానాలు కోల్పోయి 56వ స్థానానికి పరిమితమైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios