Asianet News TeluguAsianet News Telugu

కస్టమ్స్ కక్కుర్తి: ఫ్యూచర్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో అరెస్టు

వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసినప్పుడు.. అందులో దిగుమతులు ఇమిడి ఉన్నప్పుడు వేలల్లో కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కానీ వ్యాపార వేత్తలు ఫ్రీ ట్రెడెడ్ ఒప్పందాలను ఆసరగా చేసుకుని కస్టమ్స్ సుంకాలు ఎగవేయడానికి ప్రయత్నిస్తుంటారు. దేశీయ అగ్రశ్రేణి రిటైల్ చైన్ నెట్ వర్క్ దిగ్గజం ‘ఫ్యూచర్’ గ్రూప్ బంగ్లాదేశ్‌తో గల ఫ్రీ ట్రెడెడ్ ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని ఫ్యూచర్ గ్రూప్ విదేశాల నుంచి వచ్చే దిగుమతులను ఆ దేశం మీదుగా నామమాత్ర ఫీజు చెల్లించి పబ్బం గడుపుకుంటున్న సంగతి తేలింది. దీంతో గ్రూప్ సీఎఫ్ఓ దినేశ్ మహేశ్వరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. 
 

Authorities arrest top executive at Future Group over unpaid duties
Author
Mumbai, First Published Jul 15, 2019, 10:55 AM IST

ముంబై: రిటైల్‌ రంగ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో, ఎగ్జిక్యూటివ్‌ డెరెక్టర్‌ దినేష్‌ మహేశ్వరిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన పరిశ్రమ వర్గాల్లో సంచలనం సృష్టించింది. దాదాపు రెండు మిలియన్‌ డాలర్ల మేరకు కస్టమ్స్‌ డ్యూటీల ఎగవేత కేసుకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకొన్నారు. 

బంగ్లాదేశ్‌తో మనదేశానికి ఉన్న ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందాన్ని దినేశ్ మహేశ్వరిని దుర్వినియోగపర్చినట్లు తేలింది. ఆయన్ను ఎక్కడ అరెస్టు చేసిన విషయం మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఫ్యూచర్‌ గ్రూప్‌ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మీడియా ప్రతినిధుల ఫోన్ కాల్స్‌కు గానీ, ఈ-మెయిల్స్‌కు గానీ రెస్పాండ్ కాలేదు. అయితే ఇప్పటికీ దినేశ్ మహేశ్వరి పోలీసుల అదుపులోనే ఉన్నారా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు. 

ఇతర దేశాల నుంచి సరుకులను కొనుగోలు చేసి వాటిని బంగ్లాదేశ్‌కు మళ్లించినట్లు దర్యాప్తులో డీఆర్ఐ అధికారులు తేల్చారు. దుబాయ్‌, సింగపూర్‌ నుంచి దుస్తులను కొనుగోలు చేసి వాటిని బంగ్లాదేశ్‌కు తరలించి అక్కడి నుంచి పెట్రపోల్‌ మీదుగా నామమాత్ర పన్నులు చెల్లించి భారత్‌కు తీసుకొస్తున్నట్లు సమాచారం. 

పెట్రపోల్.. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్, భారత్ ‌- బంగ్లాదేశ్‌ మధ్య ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ను ఆసరాగా చేసుకొని చాలా మంది వ్యాపారులు లబ్ధిపొందుతున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

ఫ్యూచర్ గ్రూప్ సంస్థ వైవిధ్యభరితమైన రిటైల్ బిజినెస్ సంస్థల సమ్మేళనం. దీనికి బిలియనీర్ కిశోర్ బియానీ సారథ్యం వహిస్తున్నారు. ఈ గ్రూప్ పరిధిలో పలు రిటైల్ చైన్ నెట్ వర్క్‌లు బిజినెస్ లావాదేవీలు జరుపుతున్నాయి. స్థానిక, అంతర్జాతీయ బ్రాండెడ్ అప్పారెల్ బ్రాండ్లు.. ఎఫ్ బీబీ, బిగ్ బజార్, సూపర్ మార్కెట్ స్టోర్లు, ప్రీమియం లైఫ్ స్టైల్ ఫుడ్ సూపర్ స్టోర్ ఫుడ్ హాల్ దీని సొంతం. 

బంగ్లాదేశ్ ఉత్పత్తి చేసినట్లు పేర్కొంటూ పలువురు వ్యాపారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఫ్రీ ట్రేడ్ ఒప్పందాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నది. ఇది మేకిన్ ఇండియా ప్రచారోద్యమంపై నేరుగా ప్రభావం చూపుతోంది. నిజమైన భారత ఉత్పత్తిదారులకు నష్టం చేకూరుస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. 

ప్రధాని నరేంద్రమోదీ కొన్నేళ్లుగా ‘మేకిన్ ఇండియా’ ప్రోగ్రాంను ముందుకు తీసుకొచ్చారు. స్థానిక ఉత్పాదకత ద్వారా యువతకు లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. బంగ్లాదేశ్ దేశంలో తక్కువ వేతనాలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గార్మెంట్ ఇండస్ట్రీకి పేరొందింది ఆ దేశం. మొదటి స్థానంలో చైనా ఉంది. బంగ్లాదేశ్‌లో గల 4000 ఫ్యాక్టరీలు 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ గార్మెంట్స్‌ను హెచ్ఎం, వాల్ మార్ట్ వంటి సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios