Asianet News TeluguAsianet News Telugu

‘ఫ్యూచర్‌’లోకి రిలయన్స్ అడుగులు:ముకేశ్-బియానీ మధ్య చర్చలు‌!

కిశోర్ బియానీ సారథ్యంలోని ఫ్యూచర్స్ గ్రూప్’లో పెట్టుబడులు పెట్టే దిశగా ముకేశ్ అంబానీ నేత్రుత్వంలోని రిలయన్స్ అడుగులేస్తున్నది. బియానీ, అంబానీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రెండు సంస్థల మధ్య వచ్చేనెలలో అధికారిక ఒప్పందం జరుగనున్నట్లు వినికిడి.
 

Mukesh Ambani nears deal to buy stake in some companies of Future Group
Author
Hyderabad, First Published Jun 19, 2020, 11:00 AM IST

న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌ గ్రూప్‌లోని కొన్ని వ్యాపారాల్లో వాటాలను కొనుగోలు చేయడానికి కిశోర్ బియానీతో ముకేశ్ ముకేశ్‌ సంప్రదిస్తున్నట్లు అభిజ్ఞ వర్గాల సమాచారం. 

ముకేశ్‌ అంబానీకి తన డిజిటల్‌ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఈ-కామర్స్‌ దిగ్గజంగా మార్చాలన్న సంకల్పానికి ఈ ఒప్పందం ఎంతో దోహదపడనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌- ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య వాటాల కొనుగోలుపై అధికారిక ఒప్పందాన్ని వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు ఇరు కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు.

అప్పుల భారం, లాక్‌డౌన్‌తో ఫ్యూచర్‌ రిటైల్‌ ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్నది. గ్రూప్‌లోని మిగతా కంపెనీల పరిస్థితీ అంతంతే. ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా విక్రయించేందుకు కిశోర్ బియానీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కంపెనీతో ఇప్పటికే భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న అమెజాన్‌ ఇండియా వాటా కొనుగోలుకు ఆసక్తిగా ఉంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌), సమరా క్యాపిటల్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ కుటుంబానికి చెందిన వ్యక్తిగత పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సైతం ఈ దిశగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో ఇన్వెస్టర్‌ భిన్న ప్రతిపాదనతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

also read నెరవేరిన ముకేశ్ అంబానీ కల.. 8 నెలల ముందే టార్గెట్ సక్సెస్..

రిలయన్స్‌ ఏకంగా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీల్లో వాటాల కొనుగోలుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ముకేశ్‌తో డీల్‌ కుదుర్చుకునేందుకే కిశోర్‌ బియానీ మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.  

గత ఏడాది మార్చి నాటికి ఫ్యూచర్‌ గ్రూప్‌లోని 6 లిస్టెడ్‌ కంపెనీలపై ఉన్న మొత్తం రుణ భారం రూ.11,464 కోట్లుగా నమోదైంది. గత సెప్టెంబర్ చివరి నాటికి రూ.12,778 కోట్లకు పెరిగింది. బియానీ కుటుంబ హోల్డింగ్‌ కంపెనీలపై దాదాపు ఇదే స్థాయి రుణ భారం ఉంది. పైగా, హోల్డింగ్‌ కంపెనీల చేతుల్లో ఉన్న మెజారిటీ షేర్లు ప్రస్తుతం తాకట్టులో ఉన్నాయి. 

ఫ్యూచర్‌ రిటైల్‌ దేశంలోని 400 నగరాల్లో 1,500 రిటైల్ స్టోర్లు నిర్వహిస్తోంది. కాగా, రిలయన్స్‌ రిటైల్‌ దేశవ్యాప్తంగా 11,784 సూపర్‌ మార్కెట్లను నడుపుతోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో రిలయన్స్‌ రిటైల్‌ ఆదాయం రూ.38,211 కోట్లుగా నమోదైంది.

ఫ్యూచర్‌ గ్రూప్‌ హోల్డింగ్‌లో.. ఫ్యూచర్‌ కార్పొరేట్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫ్యూచర్‌ కూపన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫ్యూచర్‌ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రైకా కమర్షియల్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆకార్‌ ఎస్టేట్‌ అండ్‌ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థలు ఉన్నాయి. 

ఫ్యూచర్‌ రిటైల్‌ కొనుగోలు కోసం పోటీలో ఉన్న ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, అమెజాన్‌కు కంపెనీలో ఇప్పటికే మైనారిటీ వాటా ఉంది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ దాదాపు 6 శాతం, అమెజాన్‌ సుమారు 3.6 శాతం వాటా కలిగి ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios