Asianet News TeluguAsianet News Telugu

2022లో భారత్ జిడిపి అంచనా 8.5 శాతం.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ మనదే

2022 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలుస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక పునరుద్ధరణ జరుగుతోంది.

IMF projects India to be the fastest growing economy in the world in 2022
Author
New York, First Published Oct 12, 2021, 11:40 PM IST

2022 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలుస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక పునరుద్ధరణ జరుగుతోంది. భారతదేశం 2022లో 8.5 శాతం వృద్ధిని నమోదుచేస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ తాజా నివేదికలో 2021 సంవత్సరానికి గాను భారత్ జిడిపి వృద్ధి రేటు 9.5 శాతాన్నే కొనసాగించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రతికూల పరిస్థితులు, సప్లై చైన్ దెబ్బతినడం వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటులో కోత విధించింది. ప్రపంచ జిడిపిని 5.9 శాతంగా ప్రకటించింది. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ, భారత్‌కు వృద్ధి రేటు అంచనాలో తామెలాంటి మార్పు చేయలేదని, కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొందని అన్నారు

వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో)లో ఐఎంఎఫ్ తన జూలై అంచనాల నుంచి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి గాను భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను 8.5 శాతంగా కొనసాగించింది. Recovery During a Pandemic Health Concerns, Supply Disruptions, and Price Pressures’ పేరుతో డబ్ల్యూఈవో 2022 నాటికి ప్రపంచ ఆర్ధిక వృద్ధిని 4.22 శాతంగా అంచనా వేసింది. 

ఇదే సమయంలో జీడీపీ వృద్ధి అంచనాలను 2021 మరియు 2022 ఏడాదికి 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వరుసగా 8, 5.6 శాతంగా తెలిపింది. దీంతో 2022 ఆర్ధిక సంవత్సరం, 2023 ఆర్ధిక సంవత్సరానికి వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్థ అనే ట్యాగ్‌ను భారత్‌ మళ్లీ పొందుతుందని ఐఎంఎఫ్ తెలిపింది. 2020లో వృద్ధిని నమోదు చేసుకున్న ఏకైక ప్రధాన ఆర్ధిక వ్యవస్థగా చైనా నిలిచింది.

2021 సంవత్సరానికి చైనా జిడిపిలో ఐఎంఎఫ్ కోత విధించింది. ఈ ఏడాదిలో 8 శాతం, 2022లో 5.6 శాతం జిడిపి అంచనా వేశారు. అయితే చైనా గతేడాది మహమ్మారి కాలంలోనూ 2.3 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, భారత్ మాత్రం మైనస్ 7.3 శాతానికి పడిపోయింది. భారత్‌లో వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం గతేడాదిలో 6.2 శాతం నుంచి ఈ ఏడాదిలో 5.6 శాతానికి తగ్గిందనే విషయాన్ని సంస్థ గుర్తుచేసింది.

గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) ద్రవ్య విధాన కమిటీ 2022 ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలనుు 9.5 శాతంగా నిలుపుకుంది. గత వారం జరిగిన పాలసీ సమీక్షలో ఎంపీసీ 5.7 శాతం అంచనా వేసింది. అలాగే 2022 ఆర్ధిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణ ప్రొజెక్షన్‌ను 5.3 శాతానికి తగ్గించింది. గత వారం కూడా ప్రపంచ బ్యాంక్ (డబ్ల్యూబీ) 2021-22 భారతదేశ ఆర్ధికాభివృద్ధికి తన అంచనాను 8.3 శాతంగా వుంచింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దృష్ట్యా ఫిచ్ రేటింగ్స్ దాని అంచనాను 10 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గించింది. 

అలాగే గతేడాది 0.9 శాతంగా వున్న కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఆ ఆర్ధిక సంవత్సరంలో జీడీపీలో ఒక శాతం లోటలోకి జారిపోతుందని ఐఎంఎఫ్ తెలిపింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం లోటు మరింతగా 1.4 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. గ్లోబల్ ఎకనమిక్ వృద్ధిపై ఐఎంఎఫ్ 2021 కొరకు దిద్దుబాటు అనేది ఆధునాతన ఆర్ధిక వ్యవస్థల కోసం డౌన్‌గ్రేడ్‌ను ప్రతిబింబిస్తుంది. 

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ.. ఇటీవల పరిణామాలు మహమ్మారి ప్రతిచోటా ముగిసే వరకు ఎక్కడా ముగియలేదని స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లలో ఇది గ్లోబల్ జీడీపీని 5.3 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గించే అవకాశం వుందని గీతా గోపినాథ్ చెప్పారు. ఆహార అభద్రత చాలా తీవ్రంగా వున్న అల్పాదాయ దేశాలలో ఆహార ఎక్కువగా పెరిగాయని... ఇవి పేద కుటుంబాల భారాలు, సామాజిక అశాంతి అనే ప్రమాదాలను పెంచుతున్నాయని గీతా అన్నారు. 

జూలైలో అత్యంత డౌన్‌గ్రేడ్ ఉన్నప్పటికీ జిడిపి అంచనాలో ఇప్పటికైతే ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు. ఐఎంఎఫ్ విడుదల చేసిన డబ్లుఇఒ (వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్)లో భారత్ వృద్ధి అంచనాలను ప్రకటించారు. 2022లో భారత్ జిడిపి 8.5 శాతంగా ఉంటుందని తెలిపారు. ఫైనాన్షియల్ మార్కెట్లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంది, వైరస్ ఇంకా పోలేదనే స్పృహతో నిర్ణయాలు చేపడుతోందని తెలిపారు. వ్యాక్సినేషన్ రేట్ల విషయంలో భారత్ మెరుగ్గా ఉందని, ఇది దేశానికి సహాయకారిగా నిలుస్తోందని ఓ ప్రశ్నకు సమాధానంగా గోపీనాథ్ అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios