Business News  

(Search results - 25)
 • ril

  business13, Sep 2019, 1:29 PM IST

  రిలయన్స్ జోరు: సరికొత్త దారంతో పర్యావరణ అనుకూల దుస్తులు

  ఇప్పటికే ఆయిల్, సహజ వాయువు, కమ్యూనికేషన్ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్ను టెక్స్‌టైల్స్ మార్కెట్‌పై పడింది. ప్రస్తుత ‘‘సస్టైనబుల్ ఫ్యాషన్’’కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

 • SBI SMS/Mobile Banking

  business20, Aug 2019, 1:57 PM IST

  ఫెస్టివల్ సీజన్: కార్, పర్సనల్‌ లోన్లపై ఎస్‌బీఐ బంపరాఫర్లు

  భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న పండుగ సీజన్ సందర్భంగా బంపరాఫర్ ప్రకటించింది. దసరా, దీపావళీ పండుగలను పురస్కరించుకుని కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ప్రకటించింది.

 • allahabad bank

  business14, Jul 2019, 10:57 AM IST

  భూషణ్‌ పవర్‌ మరో చీటింగ్: అలహాబాద్ బ్యాంకుకు రూ.17,775 కోట్ల శఠగోపం

  భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ మరో అడుగు ముందుకేసి తప్పుడు పత్రాలతో పీఎన్బీతోపాటు అలహాబాద్ బ్యాంకుల్లో రూ.17,775 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ఇదీ అలహాబాద్ ఆడిటింగ్ నివేదికలో తేలింది. 

 • online games

  business5, Mar 2019, 1:51 PM IST

  టాప్‌గేర్‌లో గేమింగ్ ఇండస్ట్రీ: నాలుగేళ్లలో రూ.12 వేల కోట్లకు

  డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గణనీయంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగం భారీ స్థాయిలో వృద్ధి చెందుతోంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.11,900 కోట్లకు చేరనున్నదని కేపీఎంజీ– ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ గేమింగ్‌ రూపొందించిన నివేదిక తెలిపింది. 2014లో రూ.2,000 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ గతేడాది చివరి నాటికి రూ.4,400 కోట్లకు చేరింది.

 • business9, Feb 2019, 10:10 AM IST

  భారీ నష్టాల్లో టాటా మోటార్స్...కారణమదేనా?

  ఒక్కోసారి సానుకూల నిర్ణయాలు తీసుకున్నా బెడిసికొడుతుంటాయి. జాగ్వార్ లాండ్ రోవర్ ఒక్కప్పుడు టాటామోటార్స్ సంస్థకు లాభాలు గడించి పెట్టింది. కానీ బ్రెగ్జిట్, చైనా మందగమనం తదితర కారణాలతో సొంత సంస్థకే గుదిబండగా మారింది. భారీ నష్టాలను ప్రకటించిన టాటా మోటార్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇక దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీది మరో గాథ. వ్యూహ రచనలో దూకుడుగా దూసుకెళ్లగల సామర్థ్యం ఉన్నా.. అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన సోదరుడు ముకేశ్ అంబానీ ఒక్కో అడుగు ముందుకేస్తూ ఆసియా ఖండంలోనే కుబేరుడిగా అవతరించారు.

 • mohanan

  NATIONAL4, Feb 2019, 5:20 PM IST

  సంచలనం... ఎన్‌ఎస్‌సీ చైర్‌పర్సన్‌ రాజీనామా ప్రకటన

  జాతీయ  గణాంక సంఘం  తాత్కాలిక చైర్‌పర్సన్‌ మోహనన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఆయన  పీటీఐతో మాట్లాడుతూ...ఎన్‌ఎస్‌సీ నుంచి తాను తప్పుకోనున్నట్లు  ప్రకటించారు. కమిషన్ బాధ్యతలను తాము నెరవేర్చలేకుండా ఉన్నామని...ఈ ఒత్తిడిని తట్టుకోలేకే చైర్‌పర్సన్‌ భాద్యతల నుండి తప్పుకుంటున్నట్లు మోహనన్ పేర్కొన్నారు.  

 • Anil Ambani

  business4, Feb 2019, 2:56 PM IST

  అనిల్ అంబానీకి స్టాక్ మార్కెట్ షాక్...ఆర్‌కామ్‌ షేర్ల భారీ పతనం

  అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్) అధినేత అనిల్ అంబానీ ఎన్సీఎల్టీ ముందు దివాళా పిటిషన్ వేయాలని తీసుకున్న నిర్ణయానికి స్టాక్ మార్కెట్లు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాయి. సోమవారం మధ్యాహ్నం లోపే అనిల్ అంబానీకి చెందిన సంస్థల షేర్లు 48 శాతం మేరకు నష్టపోయాయి.
   

 • Piyush Goyal

  business2, Feb 2019, 11:37 AM IST

  ఇది ఇండస్ట్రియల్, బ్యాంకింగ్ బడ్జెట్: బడా వ్యాపారవేత్తల స్పందనిదే

   బడ్జెట్ ప్రతిపాదనల పట్ల బ్యాంకర్లు, పారిశ్రామిక వర్గాలు ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే రైతులు, వేతన జీవులను సంత్రుప్తి పరిచేలా ఉన్నా.. చిన్న పరిశ్రమలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తమైంది. 

 • chanda kochar

  business2, Feb 2019, 11:17 AM IST

  భారతీయ బ్యాంకులపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థ సంచలన వ్యాఖ్యలు

    భారతీయ బ్యాంకుల పనితీరుపై స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. వాటి పాలనా యంత్రాంగం అస్తవ్యస్థంగా, గవర్నెన్స్ వీక్‌గా ఉంటుందంటూ, దీనికి చందాకొచ్చర్ వ్యవహారమే నిదర్శనమని పేర్కొంది. 

 • onion

  business28, Jan 2019, 1:37 PM IST

  రైతు కుటుంబాలను కంటతడి పెట్టిస్తున్న ఉల్లి... 18 గంటలకో ఆత్మహత్య

  పంటలకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర ప్రకటిస్తామని ఘనంగా చెప్పుకునే నరేంద్రమోదీ సర్కార్ ఒకటిన్నర కాదు కదా.. అసలు పెట్టుబడి గిట్టుబాటయ్యే చర్యలే తీసుకోవడం లేదు. ప్రత్యేకించి ఉల్లిగడ్డల ధరలు క్వింటాల్ కు భారీగా పతనం అవుతోంది. రూ.250లకు వ్యాపారులు కొనుగోలు చేస్తే రైతుల కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఉల్లి అధికంగా పండించే మహారాష్ట్రలో గత 25 రోజుల్లో 18 మంది మృతి చెందడమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

 • SHANTANU NARAYAN

  business26, Jan 2019, 2:02 PM IST

  హైదరాబాదీ ఇంజనీర్‌కు పద్మశ్రీ.... అవార్డులకు ఎంపికైన పారిశ్రామిక దిగ్గజాలు వీరే

  దేశీయ మౌలిక వసతుల కల్పన రంగంలో పేరెన్నికన్న గన్న పారిశ్రామికవేత్త అనిల్ మణిభాయ్ నాయక్ (ఏఎం నాయక్)ను పద్మ విభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఇక పద్మ విభూషణ్ పురస్కారానికి మసాలా తయారీ సంస్థ అధినేత గులాటీ, అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త జాన్ జాంబర్స్, మన హైదరాబాదీ ఇంజినీర్ శంతను నారాయణ అడోబ్ అదినేతగా విదేశీ విభాగంలో పద్మశ్రీకి ఎంపికయ్యారు.
   

 • subash chandra

  business26, Jan 2019, 1:48 PM IST

  ఆర్థిక సంక్షోభంలో జీ గ్రూప్... జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వాటా కొనుగోలుకు సోని ఆసక్తి

  ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర పలు రకాల సుడిగుండంలో చిక్కుకున్నారు. జీ గ్రూపులో వాటాల విక్రయాన్ని ఒక ప్రతికూల శక్తి అడ్డుకున్నదని ఆరోపించిన సుభాష్ చంద్ర.. తన  కంపెనీ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నదని రుణ దాతలకు రాసిన బహిరంగ లేఖలో ఒప్పుకున్నారు. ఇక ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత పరిస్థితి అదుపు తప్పిందని, ఈ పరిస్థితి వచ్చినందుకు బ్యాంకర్లకు, వాటాదార్లకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. అన్ని రుణాలనూ తీరుస్తానని హామీ ఇచ్చారు. 

 • Air India Plane

  News26, Jan 2019, 1:24 PM IST

  రిపబ్లిక్‌ డే ఆఫర్: కేవలం రూ.979కే విమాన ప్రయాణం

  గణతంత్ర దినోత్సవం సందర్భంగా విమానయాన్ని ప్రోత్సహించేందుకు ఎయిరిండియాతోపాటు పలు విమాన యాన సంస్థలు టిక్కెట్లు తక్కువ ధరకు విక్రయించనున్నాయి. ఎయిరిండియా ఈ నెల 28 వరకు టిక్కెట్లు విక్రయిస్తుంది. జెట్ ఎయిర్వేస్ టిక్కెట్ల ధరలో 50% రాయితీనిస్తోంది. 
   

 • business23, Jan 2019, 10:58 AM IST

  పీవీ, మన్మోహన్‌లే ఆదర్శం: మోదీ ప్రభుత్వంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

  రోజురోజుకు మారుతున్న పరిణామాల నేపథ్యంలో 28 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు, ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ అమలు చేసిన ఆర్థిక సంస్కరణల విధానమే అందరికీ ఆదర్శం అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. కేంద్రీకరణ విధానాలు కిందిస్థాయిలో పూర్తిగా అమలు కాబోవని స్పష్టం చేశారు. పంట రుణ మాఫీ వల్ల ప్రయోజనం శూన్యమని తేల్చేశారు. 

 • sun farma

  business19, Jan 2019, 11:11 AM IST

  కుప్పకూలిన సన్ ఫార్మా షేర్లు...రెండు రోజుల్లోనే రూ.8,735 కోట్లు హాంఫట్

  దేశీయ ఔషధ దిగ్గజం ‘సన్‌ ఫార్మా’కు విజిల్ బ్లోయర్ (ప్రజా వేగు) సెగ బాగానే తగిలింది. కేవలం రెండు రోజుల్లో 14.27 శాతం నష్టపోయిన సన్ ఫార్మా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తద్వారా సంస్థ మార్కెట్‌ విలువలో రూ.8736 కోట్ల కోత పడింది. ప్రమోటర్ల అక్రమాలపై సెబీకి మరో ఫిర్యాదు అందినట్లు వార్తలు రావడం వల్లే దుష్ప్రచారం చేస్తున్నారని సెబీకి లేఖ రాసిన సన్ ఫార్మా.. ఆ వార్తా కథనంలోని విషయాలతో సంబంధం లేదని ఎక్స్ఛేంజీలకు స్పష్టం చేసింది. తమ సంస్థకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఈ విషయమై జోక్యం చేసుకోవాలని సెబీని చైర్మన్‌ అజయ్‌ త్యాగిని సన్‌ ఫార్మా ఆ లేఖలో కోరింది. ఈ కుట్రలో కొన్ని మీడియా సంస్థల, వ్యక్తుల పాత్ర ఉందని ఈ విషయమై పూర్తిగా విచారణ జరపాలని కోరింది.