ఇదేం మిణుగురు మెరుపులు కాదు. గత రెండేళ్లుగా పట్టణ ప్రాంతాల కంటే గ్రామాల్లోనే మోటార్ బైక్‌ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. 2017 నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు 570 బేసిక్ పాయింట్లు, ప్రయాణ వాహనాలు (కార్లు) 280 బేసిక్ పాయింట్లు పెరిగాయి. మరోవైపు దక్షిణ, పశ్చిమ ప్రాంత రాష్ట్రాల్లో కొనుగోళ్లు తగ్గాయి. 

భారతదేశంలో పట్టణ జనాభా కంటే గ్రామీణ జనాభా ఎక్కువ. రెండేళ్ల పాటు సాగిన కార్లు, కార్ల కొనుగోళ్లలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పురోగతి నమోదైంది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వాహనాల కొనుగోళ్లలో మిశ్రమ స్పందన లభించింది. 

గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి ద్విచక్ర వాహనాల కొనుగోళ్లలో 680 బేసిక్ పాయింట్లు పెరిగాయి. పట్టణ ప్రాంతాల కంటే కార్ల కొనుగోళ్లు ప్రత్యేకించి ప్రయాణ వాహనాల్లో అత్యధిక కొనుగోళ్లు జరిగాయి. వర్షాకాలంలో వర్షపాతం నమోదులో విభేదాలు ఉన్నా.. రాష్ట్రస్థాయిలో మౌలిక వసతుల అభివ్రుద్ధి, ఆధునీకరణ పురోగతిలో మెరుగుదల కనిపించింది. 

ఈ అంశాలతో గ్రామీణులు ఆటోమొబైల్ వాహనాల కొనుగోళ్లకు తమ ఆదాయం ఖర్చు చేయడానికి ముందుకు వస్తున్నారు. రెండేళ్లుగా మంచి వర్షపాతం నమోదు కావడంతో వాహనాల కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడం పెరిగిందని తెలుస్తున్నది. 

దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణ వాహనాలు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లలో రెండంకెల అభివ్రుద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వాణిజ్య వాహనాల కొనుగోళ్లలో ఆరోగ్యకరమైన పురోగతి నమోదవుతుందని భావిస్తున్నారు. ద్విచక్ర వాహనాల కొనుగోళ్లలో పశ్చిమ రాష్ట్రాల్లో 2016 - 17లో 31 శాతం, 2017 - 18లో 30.8 శాతం ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు, ప్రయాణ వాహనాల కొనుగోళ్లలో 2016- 17లో 31.4, 2017-18లో 30.8 శాతం గ్రామీణ ప్రాంతాల్లో జరిగాయి. 

దక్షిణ రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు 28.5 శాతం నుంచి 27.1 శాతం నమోదైతే, ప్రయాణ వాహనాల కొనుగోళ్లు 29.4 శాతం నుంచి 28 శాతానికి చేరుకున్నాయి. తూర్పు రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు 16.7 శాతం నుంచి 20.3 శాతానికి, ప్రయాణ వాహనాల కొనుగోళ్లు 11.2 శాతం నుంచి 12.3 శాతానికి పెరిగాయి.