2021కల్లా ముంబైలో అడుగు పెట్టనున్న పిన్ఇన్ఫారినా లగ్జరీ కార్స్

ఇటీవలే జెనీవా ఆటో షోలో బాటిస్టా మోడల్ కారును ప్రదర్శించిన మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ పిన్ఫారినా ఉత్పత్తి చేసిన లగ్జరీ కారు ముంబై రోడ్లపైకి 2021లో దూసుకు రానున్నది. ప్రత్యర్థి సంస్థ లంబోర్ఘినీతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్న పిన్ఫారినా మిలాన్, టురిన్ సమీపాన సొంత ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది. 

Pininfarina looks to set up plant near Turin, Milan

జెనీవా: మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ ఇటలీ సంస్థ ఆటోమొబిలీ పినిఫారినా తన ప్రొడక్షన్ ప్లాంట్‌ను ఇటలీలోని మిలాన్, టురిన్‌లలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే బాటిస్టా మోడల్ లగ్జరీ కారును మార్కెట్లోకి పినిఫారినా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రారంభంలో పరిమితంగా 150 కార్లు బుకింగ్ చేసుకున్న వారికి విక్రయిస్తామని కూడా పేర్కొన్నది. ముంబై రోడ్లపైకి తమ కార్లు 2021లో దూసుకొస్తుందని కంపెనీ తెలిపింది.  

2021, 2023ల్లో తమ ప్రత్యర్థి లంబోర్ఘినీ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్న నేపథ్యంలో పోటీగా మరో యుటిలిటీ వెహికల్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని పినిఫారినా బ్రాండ్ హెడ్ మిచెల్ పర్స్కే తెలిపారు.  తొలి సుస్టెయినబుల్ లగ్జరీ కంపెనీగా నిలబడాలన్నదే తమ లక్ష్యమని పినిఫారినా బ్రాండ్ హెడ్ మిచెల్ పర్స్కే చెప్పారు. వితౌట్ గిల్ట్, వినియోగదారులు కాలుష్యానికి తావు లేని అందమైన లగ్జరీ కారుతో ఎంజాయ్ చేయాలన్నదే తమ అభిమతం అని పేర్కొన్నారు. 2025 నాటికి ఏటా 6,000 నుంచి 10 వేల యూనిట్లు ఉత్పత్తి చేయాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. 

ఇటీవల మార్కెట్లో ప్రదర్శించిన బాటిస్టా లగ్జరీ కారును ఇటలీలోని తమ అనుబంధ కాంబియానో ప్రొడక్షన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నట్లు పినిఫారినా బ్రాండ్ హెడ్ మిచెల్ పర్స్కే చెప్పారు.  హైపర్ కారు నుంచి లగ్జరీ, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) కార్ల ఉత్పత్తి దిశగా పరివర్తనలో తమ సంస్థ ఉన్నదన్నారు. తమ సంస్థకు స్వంతంగా ప్రొడక్షన్ యూనిట్ అవసరమన్నారు. ఇంతకుముందు మెర్సిడెస్ బెంజ్ ఇండియా సంస్థకు, తర్వాత ఆడి, తాజాగా పినిన్ఫార్మా ఆటోమొబిలీ సంస్థ అధినేతగా ఉన్నారు. కార్ల ఉత్పత్తిలో ఆటోమొబిలీ పినిన్ఫార్మియా వద్ద ఉత్తమ టెక్నాలజీ అందుబాటులో ఉన్నదన్నారు.  

టాటా మోటార్స్ సంస్థకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 2500 వాహనాల ఆర్డర్లు
టాటా మోటార్స్ యాజమాన్యం తమకు 2,500కి పైగా కమర్షియల్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ వెహికల్స్ కోసం ఆర్డర్లు వచ్చాయని సోమవారం తెలిపింది. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్డర్ చేశాయని పేర్కొంది. గుజరాత్ రాష్ట్ర రవాణా సంస్థ (జీఎస్ఆర్టీసీ) 1045, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్నార్‌హెచ్ఎం) కింద వింగర్ అంబులెన్సుల కోసం 1000 ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. 

పుణె మహానగర్ పరివాహన్ మండల్ నుంచి 400 సీఎన్జీ బస్సుల ఆర్డర్
వీటితోపాటు మహారాష్ట్రలోని పుణె మహానగర్ పరివాహన్ మహా మండల్ (పీఎంపీఎంఎల్) నుంచి 400 సీఎన్జీ బస్సుల కోసం ఆర్డర్ లభించిందని టాటా మోటార్స్ ప్రకటించింది. టాటా మోటార్స్ ప్రెసిడెంట్ గిరీష్ వాగ్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ ప్రజా రవాణా వ్యవస్థకు డిమాండ్ శరవేగంగా పెరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా రవాణా వ్యవస్థ సురక్షితం కావడంతోపాటు కన్వీనెంట్‌గా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు తమకు గర్వంగా ఉన్నదని టాటా మోటార్స్ అధ్యక్షుడు గిరీష్ వాగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ రవాణా సంస్థలకు సొల్యూషన్స్ చూపుతూ, సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థను నిర్వహించడానికి చేయూతనిస్తున్నట్లు చెప్పారు.  
   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios