Rajesh K

  • All
  • 6305 NEWS
  • 31 PHOTOS
6336 Stories by Rajesh K
Asianet Image

గుడివాడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024  live

Jun 04 2024, 09:25 AM IST

Gudivada assembly elections result 2024:  ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం వుంది.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశమే ఈ గుడివాడ నియోజకవర్గం నుండి మొదలయ్యింది. పార్టీ ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది... ఈ సమయంలోనే గుడివాడ పేరు మారుమోగింది. ఇక మాజీ మంత్రి కొడాలి నాని పాలిటిక్స్ గుడివాడను మరింత ఫేమస్ చేసాయి. వరుసగా నాలుగుసార్లు గుడివాడ నుండే పోటీచేసిన నాని ఓటమి ఎరగడు... ఐదోసారి కూడా ఆయన గుడివాడ నుండే పోటీ చేస్తున్నాడు. దీంతో ఈసారి గుడివాడ ప్రజలు తీర్పుపై రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. 

Asianet Image

గన్నవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Jun 04 2024, 09:20 AM IST

Gannavaram assembly elections result 2024: పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీల ప్రాబల్యం గన్నవరం రాజకీయాల్లో ఎక్కువగా వుండేది... కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఈ పరిస్థితి మారింది. గన్నవరం ప్రజలు టిడిపికి అండగా నిలవడంతో 1983 నుండి 2019 వరకు ఐదుసార్లు ఈ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపి నుండి గెలిచి వైసిపిలో చేరారు. ఆయనపై వైసిపి నుండి పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరారు. ఇలా ఇద్దరు నేతలు పార్టీలు మారడంతో గన్నవరం పోరు రసవత్తరంగా మారింది. 

Top Stories