పెడన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live
Pedana assembly elections result 2024: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2008లో చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పెడన అసెంబ్లీ ఏర్పడింది. అప్పటినుండి మూడుసార్లు పెడనలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా రెండుసార్లు జోగి రమేష్ గెలిచారు. .
Pedana assembly elections result 2024: పెడన నియోజకవర్గంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పెడన మొదటి ఎమ్మెల్యే జోగి రమేష్. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత చోటుచేసుకున్న రాజకీయా పరిణామాలతో జోగి రమేష్ వైసిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసిపి తరపున పెడన నుండి పోటీచేసి మరోసారి విజయం సాధించారు. 2014 లో మాత్రం టిడిపి అభ్యర్థి కాగిత వెంకట్రావు గెలుపొందారు. ఇలా రాష్ట్ర విభజన తర్వాత పెడనలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో చేరోసారి విజయం సాధించి టిడిపి, వైసిపి సమ ఉజ్జీలుగా నిలిచాయి.
పెడన నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. గూడూరు
2. బంటుమిల్లి
3. పెడన
4. కృతివెన్న
పెడన అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 1,66,223
పురుషులు - 82,800
మహిళలు - 83,414
పెడన అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నుండి ఉప్పాల రాము బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ ను మరోచోటికి మార్చి రాముకు పెడన సీటు ఇచ్చింది వైసిపి అధిష్టానం.
టిడిపి అభ్యర్థి :
2014 ఎన్నికల్లో పెడన సీటును గెల్చుకున్న కాగిత వెంకట్రావు తనయుడే కాగిత కృష్ణప్రసాద్. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడినప్పటికీ కృష్ణప్రసాద్ నే 2024 ఎన్నికల బరిలోకి దించింది టిడిపి.
పెడన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
పెడన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
పెడన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. టీడీపీకి చెందిన అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ 91,394 ఓట్లతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పల రమేష్(రాము)పై విజయం సాధించారు.
పెడన అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
పోలయిన మొత్తం ఓట్లు - 1,45,848 (87 శాతం)
వైసిపి - జోగి రమేష్ - 61,920 (42 శాతం) - 7,839 ఓట్లతేడాతో విజయం
టిడిపి - కాగిత కృష్ణప్రసాద్ - 54,081 (37 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - లక్ష్మీ శ్రీనివాస్ - 25,733 (17 శాతం) - ఓటమి
పెడన అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
పోలయిన మొత్తం ఓట్లు - 1,35,442 (88 శాతం)
టిడిపి - కాగిత వెంకట్ రావు- 71,779 (53శాతం) - 13,694 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - బూరగడ్డ వేదవ్యాస్ - 58,085 (42 శాతం) - ఓటమి