భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్ (CDS Gen Bipin Rawat), ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఆర్మీ హెలిక్యాప్టర్ Mi-17V-5 కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, ఆయన సిబ్బంది, ఇతర అధికారులు మరణించారు. గతంలో రావత్ ఛాపర్ ప్రమాదం నుండి బయటపడ్డారు. కానీ ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో దుర్మారణం చెందారు.