అవనిగడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live
Avanigadda assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి-జనసేన-బిజెపి కూటమి మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇలా కృష్ఱా జిల్లా అవనిగడ్డలో కూడా ఎన్నికల రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.
Avanigadda assembly elections result 2024: అవనిగడ్డ నియోజకవర్గంలో సింహాద్రి, మండలి కుటుంబాలదే రాజకీయ ఆదిపత్యం. మండలి వెంకట కృష్ణారావు మూడుసార్లు (1972,1978, 1983) కాంగ్రెస్ నుండి, సింహాద్రి సత్యనారాయణ రావు కూడా మూడుసార్లు ( 1985,1989,1994) టిడిపి నుండి అవనిగడ్డ ఎమ్మెల్యేగా పనిచేసారు. అయితే తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మండలి బుద్దప్రసాద్ రాజకీయాల్లోకి వస్తే సింహాద్రి చంద్రశేఖర్ రావు మాత్రం డాక్టర్ వృత్తిని చేపట్టారు. కానీ ఇప్పుడు వైసిపి డాక్టర్ చంద్రశేఖర్ ను అవనిగడ్డ బరిలో దింపుతోంది.
అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మండలి బుద్దప్రసాద్ మూడుసార్లు పనిచేసారు. రెండుసార్లు (1999,2004) కాంగ్రెస్, ఓసారి (2014) టిడిపి నుండి పోటీచేసారు. టిడిపి హయాంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసారు. మండలి బుద్దప్రసాద్ మంచి రచయిత కూడా... ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘంకు అధ్యక్షుడిగా కూడా పనిచేసారు.
అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. అవనిగడ్డ
2. నాగాయలంక
3. కోడూరు
4. చల్లపల్లి
5. మోపిదేవి
6. ఘంటసాల
అవనిగడ్డ అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,10,965
పురుషులు - 1,04,121
మహిళలు - 1,06,823
అవనిగడ్డ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
అవనిగడ్డ అభ్యర్థిగా సింహద్రి రమేష్ బాబు ను బరిలో దించింది వైసిపి.
అవనిగడ్డ సింహద్రి రమేష్ బాబు మండలి బుద్ధప్రసాద్ ( జనసేన)
టిడిపి అభ్యర్థి :
పొత్తులో భాగంగా మండలి బుద్ధప్రసాద్ ( జనసేన)ను బరిలో దించారు. .
అవనిగడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
అవనిగడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రమేశ్‌బాబు సింహాద్రిపై జేఎస్పీ అభ్యర్థి బుద్ధప్రసాద్ మండలి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మండలి బుద్ధప్రసాద్ 113460 ఓట్లతో విజయం సాధించారు.
అవనిగడ్డ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
పోలయిన మొత్తం ఓట్లు - 1,84,394 (88 శాతం)
వైసిపి - సింహాద్రి రమేష్ బాబు - 78,447 (42 శాతం) - 20,725 ఓట్లతేడాతో ఘనవిజయం
టిడిపి - మండలి బుద్దప్రసాద్ - 57,722 (31 శాతం) - ఓటమి
అవనిగడ్డ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
పోలయిన మొత్తం ఓట్లు - 1,68,232 (85 శాతం)
టిడిపి - మండలి బుద్దప్రసాద్ - 80,995 (48 శాతం) - 5,958 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - సింహాద్రి రమేష్ - 75,037 (44 శాతం) - ఓటమి