Asianet News TeluguAsianet News Telugu

పెనమలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Penamaluru assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ పెనమలూరు నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకున్నాయి.  

Penamaluru assembly elections result 2024 ... Andhra Pradesh Assembly Elections 2024 krj
Author
First Published Jun 4, 2024, 9:37 AM IST

Penamaluru assembly elections result 2024: పెనమలూరు నియోజకవర్గంలో టిడిపి, వైసిపి లకు సమాన బలాలున్నాయి. నియోజకవర్గ ఏర్పాటుతర్వాత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, టిడిపి, వైసిపి లు ఒక్కోసారి గెలిచాయి. అయితే ఓసారి కాంగ్రెస్, మరోసారి వైసిపి నుండి పెనమలూరు బరిలో నిలిచి గెలిచిన పార్థసారథి 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందే టిడిపిలో చేరారు. దీంతో పెనమలూరు రాజకీయ సమీకరణలు మారాయి. దీంతో ఈసారి పెనమలూరుపై ఏ పార్టీ జెండా ఎగురుతుందోనన్న ఆసక్తి రాజకీయా వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ నెలకొంది. 

పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1.  కంకిపాడు 
2. వుయ్యూరు 
3. పెనమలూరు
 
పెనమలూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌-  267803

పురుషులు -  130589
మహిళలు ‌- 137206

పెనమలూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి : 

పెనమలూరు బరిలో మంత్రి జోగి రమేష్ నిలిచారు. ఆయనను పెడన నుండి ఇక్కడికి మార్చింది వైసిపి అధిష్టానం 

టిడిపి అభ్యర్థి : 

పెనమలూరు టిడిపి అభ్యర్థిగా  మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బరిలో నిలిచారు.  

 
పెనమలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

పెనమలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

పెనమలూరు  నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. టీడీపీకి చెందిన బోడే ప్రసాద్‌ విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన రమేశ్ పై 59915 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

పెనమలూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

పోలయిన మొత్తం ఓట్లు - 2,13,929 

వైసిపి -  కొలుసు పార్థసారథి - 1,01,485 (47 శాతం) - 11,317 ఓట్లతేడాతో విజయం 

టిడిపి - బోడె ప్రసాద్ - 90,168 (42 శాతం) -  ఓటమి 

బహుజన్ సమాజ్ వాది పార్టీ (బిఎస్పి) - ఎల్. కరుణాకర్ దాస్ - 15,388 (7 శాతం) - ఓటమి 


పెనమలూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు : 

టిడిపి - బోడె ప్రసాద్ - 1,02,330 (54 శాతం) - 31,448 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం 
 
వైసిపి -  వీఆర్ విద్యాసాగర్  కుక్కల - 70,882 (38 శాతం) - ఓటమి 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios