1. అమృతవాసిరెడ్డి

ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? వివాహం ఎప్పుడు అవుతుంది?

మీకు ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. 2020 జనవరి తరువాత వివాహానికి మరియు ఉద్యోగానికి అనుకూలం అవుతుంది. అప్పటివరకు వివాహానికి కూడా ప్రయత్నం చేయకూడదు. నిరంతరం జపం చేస్తూ దానం చేస్తూ ఉండాలి.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : నూనె / పల్లీలు 2. పశుపక్షాదులకు ఆహారాన్ని, నీిని ప్టోలి. 3. కందిపప్పు / కర్జూరాలు/ దానిమ్మపళ్ళు దానం చేయాలి.

2. హరి కృష్ణ

ఉద్యోగం రావడం లేదు

మీకు ఏదో ఒక ఉద్యోగం ప్రస్తుతం వస్తుంది. మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది. 2020 జనవరి వరకు సమయం అనుకూలంగా ఉన్నది.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః; శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రజపాన్ని నిరంతం చేసుకోవాలి

దానం : నిమ్మకాయ పులిహోర / అలంకరణ వస్తువులు / డ్రైఫ్రూయిట్స్  దానం చేయాలి.

3. మహేందర్‌ బాబు

ఉద్యోగం ఎప్పుడు వస్తుంది.

మీకు ప్రస్తుతం సమయం నుకూలంగానే ఉన్నది. ఉద్యోగం వస్తుంది. 2022 తర్వాత స్థిరత్వం వస్తుంది. కాని మీరు ఒకి గుర్తు ఉంచుకోవాలి. మీకు ఏ ఉద్యోగం వచ్చినా అందులో ఒత్తిడి మాత్రం తప్పదు. ఎక్కువ శ్రమతో తక్కువ సంపాదన ఉంటుంది. మీరు దాన ధర్మాలు నిరంతరం ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. మీకు వచ్చిన ఆదాయంలో 20 శాతం దాన ధర్మాలు పంచాలి.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః; శ్రీ రామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం నిరంతరం చేసుకోవాలి.

దానం : 1. గోధుమపిండి / చపాతీలు, 2. పళ్ళు / విద్యార్థులకు పుస్తకాలు; 3. కూరగాయలు / ఆకు కూరలు, 4. నిమ్మకాయ పులిహోర / అలంకరణ వస్తువులు/ డ్రై ఫ్స్ర్‌ూ. ఇవి అన్నీ కూడా తప్పనిసరిగా దానం చేయాలి.

జపం దానం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత అనుకూలం ఉంటుంది జీవితంలో. లేకపోతే అన్ని పనుల్లో ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

4. సులక్షణ

వివాహం ఎప్పుడు అవుతుంది? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

మీకు ప్రస్తుతం ఏదైనా ఉద్యోగం వచ్చినా అది చిన్నగా ఉంటుంది. అందులో శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది. 2020 జనవరి తర్వాత ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. వివాహానికి కూడా 2020 జనవరి నుంచి 2022 ఆగస్టు వరకు మంచి సమయం. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ప్రస్తుతం వివాహానికి అనుకూలం కాదు.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

శ్రీ రాజమాతంగ్యై నమః     ; శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ఈ పైన చెప్పిన జపాలు నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానం : 1. ఇడ్లీ / వడ, 2. అలంకరణ వస్తువులు/ నిమ్మకాయ పులిహోర తప్పనిసరిగా దానం చేయాలి.

ఏడిది నరేంద్ర

ప్రస్తుతం జాతకం ఎలా ఉంది?

ప్రస్తుతం నవంబర్‌ 2019 వరకు సమయం కొంత అనుకూలంగా ఉంది. నవంబర్‌ 2019 తర్వాత నుంచి 2022 జులై వరకు అంత అనుకూలమైన సమయం కాదు. అన్ని పనుల్లో ఒత్తిడి ఉంటుంది. అన్ని పనులకు కూడా ఆలస్యం అవుతుంది. కొంత బద్ధకం పెరిగే అవకాశం ఉంది. ప్రతీరోజూ యోగాసనాలు, ప్రాణాయామం కాని లేదా ఉదయం పూట  నడక గాని తప్పనిసరిగా చేయాలి. ప్రాణాయామాలు తప్పనిసరి.

తీసుకునే ఆహారంలో నీరు అధికంగా ఉండాలి. ఆహార పదార్థాలు నమిలి మ్రింగాలి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ ; హరహర శంకర, జయజయ శంకర జపం మంచిది.

దానం : నూనె / పల్లీలు దానం అధికంగా చేయాలి.

మీ దగ్గర డబ్బు నిల్వ ఉండదు కావున మీరు ధనం దాచిప్టోలనే ఆలోచన ఉంచుకోరాదు. ఎప్పికప్పుడు అవి మంచికార్యాలకు వినియోగిస్తే మీకు మంచి పేరుప్రతిష్టలు వస్తాయి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అధికంగా చేయాలి. మీకు ప్రస్తుత జన్మ వచ్చింది అందుకే. గురువులకు సేవ చేసుకోవాలి. దేవాలయాల నిర్మాణానికి ధనం వినియోగించాలి. వేదపాఠశాలలు, చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలి.

డా.ఎస్.ప్రతిభ