ఈ రేఖ సూర్యరేఖ పక్కనుండి బయలుదేరి చక్కగా దోషం లేకుండా బుధ స్థానానికి చేరుట చాలా మంచిది. ఒక క్రమంలో చెప్పాలి అంటే ప్రధాన రేఖలలో ఒక రేఖ ఐన జీవితరేఖ పక్క నుండి ధనరేఖ, దాని పక్కనుండి సూర్యరేఖ చివరిగా దాని పక్కనుండి బుధ రేఖ ఉండవలెను. ఒకవేళ ధనరేఖ సూర్యరేఖ లేకుండ బుధ రేఖ ఉంటే ఇది ఊర్ధ్వరేఖ అయి ధనకారకమే అవుతుంది. నిజానికి ధన, సూర్య, బుధ, అనగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం ఇవి అన్నీ ధన ప్రధానములే. అన్నియొక్క అంతిమలక్ష్యం ధనమే అంటే చేపట్టే వృత్తులు వేరు కావొచ్చు కాని ప్రవృత్తి ధన సంపాదన మాత్రమే అని చెప్పుకోవాలి.

బుధరేఖ ఎక్కడ ప్టుటినా బుధస్థానంలో ముగింపబడితేనే అది బుధ రేఖగా గుర్తింపు పొందుతుంది. కాని ఈ రేఖ బుధ కారకములను ఏవో కొన్నింని ప్రోత్సహించుటకు ఉత్తేజపరుచుటకు సహకరించడానికా అన్నట్లు నడుపుతున్న బండి వెనుక గాలిగా పనిచేస్తుంది. అనగా బండి వేగం పెరుగుతుంది. కాబట్టి బుధ స్థానంలో మూడుకు మించకుండా రేఖలున్న ఎన్ని స్థాయిరేఖలుంటే అన్ని బుధకారకాలు ఈ బుధ రేఖద్వారా ఉద్ధరింపబడతాయి.

ఉదా : ఒక రేఖ వలన వ్యాపారం చేయాలని ఒక జాతకుడు అనుకుంటే మరొకరు శాస్త్రపరిజ్ఞానం పొందవలెననుకుంటారు. మరికొందరు పరిశోధనలు చేయాలనుకుంటారు. మరికొందరు వైద్యనిపుణులు కావాలని అనుకుంటారు. ఈ రకంగా వారివారి అవసరాలకు అనుకూలమైన స్థాయి రేఖలనే ఈ బుధరేఖ వాటికి తోడ్పాటును అందించగలవని స్థూలంగా భావించాలి.

సూర్యరేఖలేకుండా బుధరేఖ ఉన్న ఈ రేక ఉభయాత్మక రేఖ అని అనకూడదు. ఈ బుధ రేఖను వ్యాపారరేఖ, పరిశోధనరేఖ, వైద్య (చికిత్స)రేఖ, ఆరోగ్యరేఖ, మరియు అనామయ రేఖ అని వేరువేరు పేర్లతో పిలుస్తారు.

ఈ రేఖ వ్యాపారం, వైద్యం ,అనారోగ్యం, శాస్త్రజ్ఞానం, పరిశోధన, హాస్యం, వాక్‌ చతురత, మొదలైన కారకాలు వర్తిస్తాయి.

ఉదా : ఇది జాతకుని శక్తి సామర్థ్యాలు, సంకల్పాలను బట్టి ఉంటుంది. స్పష్టతకు ఉదాహరణగా వ్యాపారాన్నే తీసుకుంటే శుక్రస్థానం నుండి బయలుదేరిన కాస్మిక్‌ వ్యాపారం, గార్మ్‌ెం వ్యాపారం, ఫ్యాబ్రిక్స్‌ వ్యాపారం,  లేడీస్‌ ఎంపోరియం అలాగే చంద్రస్థానం నుండి బయలుదేరిన టూరిజం, సీ ావెల్స్‌, ఎయిర్‌ క్రాఫ్ట్‌ బిజినెస్‌, కుజస్థానం నుండి బయలుదేరిన స్పోర్ట్‌ షాప్స్‌, డిఫెన్స్‌ సంబంధ వ్యాపారాలు, ఫ్యాక్టరీలు, మిల్స్‌ విం వ్యాపారాలు, అలాగే ఈ రేఖ నుండి గురు స్థానానికి వెళ్ళిన ఫుడ్‌ బిజినెస్‌, పూజా స్టోర్ట్స్‌, బుక్‌ స్టాల్స్‌, మ్యారేజ్‌ బ్యూరోస్‌, శని స్థానమునకు వెడలిన అగ్రికల్చర్‌, ఐరన్‌, ఆయిల్‌ బిజినెస్‌, సూర్యస్థానంలోనే ఈ రేఖకు పాయలు తడిగిన మెడికల్‌ హాల్స్‌, ఫార్మాసుటికల్స్‌, కెమికల్స్‌ విం వ్యాపారాలు చెప్పుకోవాలి. అంతేకాదు ఆయా గ్రహాలనుండి రేఖలు వచ్చి ఈ బుధ రేకకు తాకిన ఇి్టవి మాత్రమే జాతకుని యొక్క ఇష్టానుసారం కూడా చెప్పాలి.

వ్యాపారం అన్న కారకం జాతకునికిష్టమైనచో నేను (జాయ్‌టిం వ్యాపారం) ఒకరితో కలిసి వ్యాపారం చేయవచ్చునా అన్న ప్రశ్న అడిగితే మాత్రం బుధ స్థానంలో స్థాయి రేఖను చూసి అతడేగ్రహ జాతకుడో చూసి ఆ గ్రహానికి భౌతికమైన మిత్రత్వం కాకుండా గ్రహమైత్రి కలవారితో మాత్రమే అచ్చివచ్చునని చెప్పుట కొసరమెరుగా చెప్పాలి.

డా|| ఎస్‌. ప్రతిభ