Asianet News TeluguAsianet News Telugu

హెయిర్ కట్ మంగళవారం ఎందుకు చేసుకోకూడదు..? మరి ఏ వారం చేసుకోవాలి?

ఇది శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే పూర్వ పద్ధతులను తెలియ జేయడం జరుగినది. ఇందులో చాలా పద్దతులు ఉన్నాయి. ఉదయం 12 గంటల లోపు చేయించుకున్న శుభం కలుగుతుంది. రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు  ఒకే రోజు చేసుకో కూడదు.

Beware: Cut your nails and hair on the right day of the week
Author
Hyderabad, First Published Feb 8, 2020, 11:39 AM IST

సర్వ సాధారణంగా ప్రస్తుత కాలంలో మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే కటింగ్ చేసుకుంటూ ఉన్నాం , కానీ క్షురకర్మలకు శాస్త్ర రిత్య కొన్ని సూచనలు ఉన్నాయి వారంలో ఏ రోజు మనం కటింగ్ చేయించు కుంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో శాస్త్ర పరంగా గమనిద్దాం. ఇది శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే పూర్వ పద్ధతులను తెలియ జేయడం జరుగినది. ఇందులో చాలా పద్దతులు ఉన్నాయి. ఉదయం 12 గంటల లోపు చేయించుకున్న శుభం కలుగుతుంది. రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు  ఒకే రోజు చేసుకో కూడదు.

వారము                     ఫలితము

ఆదివారము             -     ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది. తత్ ఫలితంగా శరీరం అధిక వేడి పొందుతుంది.

సోమవారముము      -            ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును , సౌఖ్యం కలుగ జేస్తుంది. పుత్రులు కోరుకునే గృహస్థులు,             ఒకే ఒక పుత్రుడు గలవారు క్షవరము చేయించుకోనగూడదు.

మంగళవారముము   -         ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది. తత్ ఫలితంగా దు:ఖం కలుగజేస్తుంది.

బుధవారముము       -           ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుష్టిని కలుగ జేస్తుంది.

గురువారముము       -        పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షవరము             చేయించుకోనగూడదు. తత్ ఫలితంగా ధన నాశనం కలుగజేయును. 

శుక్రవారముము        -           పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును. తత్ ఫలితంగాశక్తి తగ్గును అక్కా ,చెల్లెళ్ళు కలవారు             చేయించుకో రాదు.

శనివారముము          -        ఏడు మాసములు ఆయుక్షీణమ్ కలిగించును. తత్ ఫలితంగా రోగ వృద్ధిని కలుగజేయును. 

క్షురకర్మకు అనుకూలమైన తిధులు :- విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి, తిధులు శుభం .

క్షురకర్మకు ప్రతికూలమైన తిధులు :- ఆదివారం , శనివారం , మంగళవారంనాడు క్షురకర్మ చేయించుకున్న మంచిదికాదు.

క్షురకర్మకు అనుకూలమైన నక్షత్రాలు  :- హస్త  , చిత్త , స్వాతి , పునర్వసు, పుష్యమీ, మృగశిర , ధనిష్ఠ , శతభిషం, అశ్విని , రేవతి, నక్షత్రాలలో శుభం .
 
క్షురకర్మకు ప్రతికూలమైన నక్షత్రాలు:- మఖ , కృత్తిక , ఉత్తర, అనురాధ, ఈ నక్షత్రాలలో చేసుకోవద్దు.

పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు:- గృహంలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి.అంతకన్నాపెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. నుదుట బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పై జన్మలో చేతులు లేకుండా జన్మించటం, చేతులు పోవటం కానీ జరుగుతాయి. 

దేవునికి ( ఈశ్వరునికి )  వీపు చూపరాదు, ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులో వుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడమ చేయి పూజా విధులలో నిషేధం. ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు. 
    
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.

స్త్రీలకి నిషిద్ధకర్మలు :- స్త్రీలు తులసీ దళాలు తుంచ రాదు. పురుషులు మాత్రమే తుంచ వలెను. పౌర్ణమి, అమావాస్య నాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననూ త్రి సంధ్యల కాలంలో, మైల రోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచిననూ మహాపాపం. 

స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలా కనపడితే భర్తకి గండం. బయటకి వెళుతున్నపుడు స్త్రీ జుట్టు విరబోసుకుని కనపడితే వెనక్కి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచం సేపు కుర్చుని వెళ్ళాలి. స్త్రీలు చెవి దిద్దులు లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం, శ్రేయస్సు కాదు. 

పురుషులకి నిషిద్ధకర్మలు :- పూర్తిగా శిరో ముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరో ముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదుల యందు, వ్రత దినముల యందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షురకర్మ పనికిరాదు.

పై తెలిపిన శాస్త్రీయ పద్ధతులు భక్తీ శ్రద్ధలతో ఆచరించిన వారికి శుభఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సిరి సంపదలు కలుగుతాయి.ఆనాదిగా కాలంగా మన పూర్వీకుల నుండి  వస్తున్న శాస్త్రీయ పద్ధతులు పెడచెవిన పెట్టె వారిని, ఆధునిక పోకడతో పోయేవారికి వారి విజ్ఞతకే వదిలి వేయాలి. నమ్మిన వారికి నారాయణుడు ఉన్నాడు , నమ్మని ఆచరించని వారికి నారాయణుడే ఉన్నాడు జై శ్రీమన్నారాయణ.   

Beware: Cut your nails and hair on the right day of the week
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios