Asianet News TeluguAsianet News Telugu

కార్తీక పౌర్ణమికి ఎందుకు అంత ప్రత్యేకత ?

అన్ని నెలల్లోకి పుణ్యాన్ని ఎక్కువగా సంపాదించుకోవడానికి దీనికి ఎందుకు అంత ప్రత్యేకత?

astrology.. karthika pournami special story
Author
Hyderabad, First Published Nov 23, 2018, 11:05 AM IST

ఇంగ్లీషు నెలల లాగా ఇష్టం వచ్చినప్పుడు ఒక మాసం పేరు కలుపుకోవడం, ఒక మాసం పేరు తీసి వేయడం వాటిని తమకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకోవడం తెలుగు మాసాలకి కుదరదు. తెలుగు నెలలకు ఖగోళాన్ని అనుసరించి ఆకాశంలో ఉండే నక్షత్రాలను అనుసరించి వాటికి ఆ పేర్లు వచ్చాయి. కాబ్టి తెలుగు నెలలకి ప్రత్యేకత ఉంటుంది. 27 నక్షత్రాల్లో 12 నక్షత్రాలు ప్రతీ పౌర్ణిమనాడు ఒక్కో నక్షత్రం వచ్చి ఆ నెలల పేర్లు ఏర్పడ్డాయి. అలాగే కృత్తికా నక్షత్రం పౌర్ణమినాడు వచ్చే మాసాన్ని కార్తీక మాసం అంటారు. అన్ని నెలల్లోకి పుణ్యాన్ని ఎక్కువగా సంపాదించుకోవడానికి దీనికి ఎందుకు అంత ప్రత్యేకత?

పన్నెండు రాశుల్లోనూ చంద్రుడికి వృషభరాశి ఉచ్చరాశి అవుతుంది. ఇందులో రోహిణి నక్షత్రం ఉంటుంది. చంద్రునికి 27 నక్షత్రాలను ఇచ్చి వివాహం చేసారు. కాని చంద్రునికి రోహిణి అంటే అందరిలోకి ఇష్టమైన భార్య. ఇష్టమైన వారి దగ్గర తమ పనులు అన్నీ నెరవేర్చుకోవచ్చు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుడు మనసుకు కారకుడు.

మొన్ని వరకు వర్షాలు పడి నేల అంతా తడితడిగా ఉంటుంది. ఇప్పుడు భూమి సారవంతంగా మారి పంటలకు అనుకూలంగా ఏర్పడుతుంది. ప్రస్తుతం చలి అధికంగా ఉండే మాసం కూడా. ఈ కాలంలోనే ఎక్కువ నియమ నిష్టలతో ఉండాలి. చలికి శరీరం తొందరగా ఏ పని చేయడానికి ఇష్టపడదు. ఎంతసేపు వీలైతే అంత బద్ధకంగా ఉండడానికి, హాయిగా పడుకోవడానికి ఇష్టం ఎక్కువగా ఉంటుంది.

మనిషికి కట్టుబాటు ఆచారం, సంప్రదాయం లేకపోతే తనకు తోచినట్లు తాను ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసే మన పెద్దలు కొన్ని ఆచారాలను కొన్ని మాసాల్లో చేయాలని తప్పనిసరి విధించారు. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండడం వేడికోసం ఎదురు చూపులు ఎక్కువగా ఉండడం సహజం. కాబట్టే దీపావళి నుంచి దీపాల పండుగ ఆరంభం అవుతుంది. ఈ ఒక్క నెలరోజులు చలి అధికంగా ఉంటుంది. వెలుగులను నింపుకోవాలని దీపాలు పెట్టడం ఆనవాయితీ అయింది.

మామూలుగా దీపాలు వెలిగించాలంటే కరెంటుతో వేరు వేరు బల్బులు ప్టిె వెలిగిస్తారు. కాని నూనె ఒక చిన్న ప్రమిదలలో వేసి వాటిని ఉదయం సాయంకాలం వెలిగిస్తే ప్రకృతి అంతా వెలుగుల మయంగా మారుతుంది. ఆ వెలుగును చూస్తూ తమలోని అంధకారాన్ని పోగొట్టుకోవాలని శరీరాన్ని ఒక క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడానికి ఈ నియమాలు ప్టోరు. లేకపోతే ఇష్టం వచ్చిన పదార్థాలు అన్నీ తిని ఒంటిలో కొవ్వును పెంచుకుటాంరు. ఈ సమయంలో శరీరంలో కొవ్వు తొందరగా పెరుగుతుంది. ఏ పనీ లేకపోతే ధ్యాసంతా ఆకలివైపు వెళుతుంది. తమ ఆలోచనలను మళ్ళించడం కోసం ఈ పండుగలను ఏర్పాటు చేసారు.

దేవాలయాల్లో జ్వాలా తోరణాలని గడ్డితో చూట్టూ ఒక చక్రంలా పేర్చి దానికి నిప్పు అంటించి ఉత్సవ విగ్రహాలను అందులోంచి తీసుకువెళతారు. ఆ మిగిలిన గడ్డిని పశువులకు తినిపించడం వలన వాటికి వచ్చే అనారోగ్యాలు రాకుండా ఉంటాయని ప్రజల విశ్వాసం.

తమ శరీరంలో ఉండే అంధకారాన్ని, ప్రకృతిలో ఉండే అంధకారాన్ని తీసివేయాలని సూత్రం. ఎప్పుడూ మనిషి ఏవో తప్పులు చేస్తూనే ఉంటాడు. ఆ తప్పులను సరిదిద్దుకొని గతంలో చేసిన తప్పులకంటే ప్రస్తుతం ఇంకా తక్కువగా పొరపాట్లు ఉండాలని, దాని వలన తమ కర్మదోషాలను ప్రతీ సంవత్సరం కొంత కొంత తగ్గించుకోవాలనే 365 వత్తులను, లక్ష వత్తులను ఈ పూర్ణిమనాడు వెలిగించడం ఆనవాయితీగా మారింది. అంటే వత్తి ఏవిధంగా కాలుతూ అందరికీ వెలుగును అందిస్తుందో మనిషి కూడా తనలోని ఈర్షా ద్వేషాలు, కోపతాపాలు, అసూయలను తగ్గించుకుంటూ ఎదుటివారికి వెలుగును ఇవ్వాలని దీని అర్థం.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios