హైదరాబాద్: హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరానికి రెడీ అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. 

అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ ఉభయగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని వ్యూహరచన చేస్తున్నారు. 

గెలుపు గుర్రాళ్లకే టిక్కెట్ ఇవ్వాలన్న నేపథ్యంలో ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. బలహీనంగా ఉన్న అభ్యర్థుల విషయంలో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు వైఎస్ జగన్. జిల్లా నేతలతో మరోసారి సమావేశమై మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. 

1. కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
2. కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు
3. తుని – దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) 
4. ప్రత్తిపాడు – పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ 
5. పిఠాపురం – పెండెం దొరబాబు 
6. పెద్దాపురం – పెండింగ్
7. అనపర్తి –పెండింగ్
8. రామచంద్రపురం – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 
9. ముమ్మిడివరం – పెండింగ్
10. అమలాపురం – పెండింగ్
11. రాజోలు –పెండింగ్
12. పి.గన్నవరం –పెండింగ్ 
13.  కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి 
14. మండపేట – పెండింగ్
15. రాజానగరం – జక్కంపూడి రాజా 
16. రాజమండ్రి సిటీ – రౌతు సూర్యప్రకాశరావు    
17. రాజమండ్రి రూరల్ – పెండింగ్
18. జగ్గంపేట – తోట వాణి
19.  రంపచోడవరం – పెండింగ్

ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తరాంధ్ర వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ: బరిలో నిలిచేది వీరే.....

కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థుల ఖరారు : బరిలో నిలిచేది వీరే....

గుంటూరు వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి: అభ్యర్థుల జాబితా ఇదే......

నెల్లూరు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే వారి జాబితా రెడీ

చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: పోటీ చేసేది వీరే.....

అనంతపురం వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ: బరిలో నిలిచేది వీరే....

కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......

కర్నూలు వైసీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి: బరిలో నిలిచే అభ్యర్థులు వీరే.....