హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరానికి రెడీ అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. 

అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే కర్నూలు జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 

  
కర్నూలు వైసీపీ అభ్యర్థుల ఖారరు: పోటీ చేసేది వీరే...
1. ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి 
2. శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి
3. నందికొట్కూరు – ఐజయ్య /ఆర్థర్
4. కర్నూల్ – ఎండీ అబ్దుల్ హఫీజ్ ఖాన్/ ఇక్బాల్
5. పాణ్యం – కాటసాని రామ్ భూపాలరెడ్డి
6. నంద్యాల – శిల్పా మోహన్ రెడ్డి /శిల్పా రవికిషోర్ రెడ్డి
7. బనగానపల్లి – కాటసాని రామిరెడ్డి
8. డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
9. పత్తికొండ – కంగేటి  శ్రీదేవి
10. కోడుమూరు – పరిగెల మురళీకృష్ణ/ డా.సుధాకర్
11. ఎమ్మిగనూరు – కె.చెన్నకేశవరెడ్డి 
12. మంత్రాలయం – వై.బాలనాగిరెడ్డి
13. ఆదోని – వై. సాయిప్రసాదరెడ్డి
14. ఆలూరు – గుమ్మ‌నూరు జయరామ్