హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరానికి రెడీ అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. 

అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే అనంతపురం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 

అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు:

1. రాయదుర్గం– కాపు రామచంద్రారెడ్డి 
2. ఉరవకొండ – వై. విశ్వేశ్వరరెడ్డి 
3. గుంతకల్ – వై.వెంకటరామిరెడ్డి
4. తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి
5. శింగనమల – జొన్నలగడ్డ పద్మావతి
6. అనంతపురం అర్బన్ – అనంత వెంకటరామిరెడ్డి /మహాలక్ష్మి శ్రీనివాస్ 
7. కళ్యాణదుర్గం – కె.వి. శ్రీచరణ్ 
8. రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
9. మడకశిర – ఎం. తిప్పేస్వామి
10. హిందూపురం – ఇక్బాల్ /నవీన్ నిశ్చల్/అబ్దుల్ ఘనీ
11. పెనుగొండ – ఎం.శంకర్ నారాయణ
12. పుట్టపర్తి – డి. శ్రీధర్ రెడ్డి
13. ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
14.  కదిరి – డాక్టర్ పి.వి. సిద్ధారెడ్డి
 

ఈ వార్తలు కూడా చదవండి

కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......

కర్నూలు వైసీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి: బరిలో నిలిచే అభ్యర్థులు వీరే.....