కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే...... 
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కదన రంగంలోకి దూకారు. ఇప్పటికే ప్రజా సంకల్పయాత్ర పేరుతో నిత్యం ప్రజల మధ్యే ఉన్న జగన్ ఆ తర్వాత సమర శంఖారాం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. 

తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిని దాదాపుగా పూర్తి చేశారు వైఎస్ జగన్. అటు తెలుగుదేశం పార్టీకి ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితా ఖారైనట్లు ప్రచారం జరుగుతుంది. 

వైఎస్ఆర్ కడప జిల్లా అభ్యర్థుల వివరాలు
1. పులివెందుల – వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  
2. రాజంపేట- మేడా మల్లికార్జునరెడ్డి 
3. కడప -షేక్ అజ్మత్ బాషా 
3. కోడూరు – కోరుముట్ల శ్రీనివాసులు
4. రాయచోటి – గండికోట శ్రీకాంత్ రెడ్డి 
5. పులివెందుల – వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
6. కమలాపురం – పి.రవీంద్రనాథ్ రెడ్డి 
7. బద్వేల్ ‍‍‍- డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య
8. జమ్మలమడుగు – డాక్టర్ సుధీర్ రెడ్డి 
9. ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
10. మైదుకూరు – ఎస్. రఘురామిరెడ్డి

ఇకపార్లమెంట్ అభ్యర్థుల వివరాలకు వస్తే సిట్టింగ్ అభ్యర్థులకే వైఎస్ జగన్ టికెట్ ఖరారు చేశారు. కడప పార్లమెంట్ అభ్యర్థిగా సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపిక చేశారు. మరోవైపు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డినే ఖరారు చేశారు.