హైదరాబాద్: హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరానికి రెడీ అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. 

అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఉత్తరాంధ్రలో పాగా వెయ్యాలని వైఎస్ జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగా అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఐదు సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


విశాఖపట్నం జిల్లా అభ్యర్థుల వివరాలు:

1. విశాఖపట్నం ఈస్ట్-చెన్నుబోయిన శ్రీనివాసరావు
2. విశాఖపట్నం వెస్ట్- మళ్లా విజయప్రసాద్్
3. విశాఖపట్నం  నార్త్-కె.కె.రాజు
4. భీమిలి – అవంతి శ్రీనివాస్ 
5. గాజువాక – తిప్పల నాగిరెడ్డి  
6. చోడవరం – కరణం ధర్మశ్రీ 
7. మాడుగుల – ముత్యాలనాయుడు.
8. అరకు – శెట్టి ఫాల్గుణ / కె.రవిబాబు
9. పాడేరు – కె. భాగ్యలక్ష్మి/విశ్వేశ్వరరావు 
10. అనకాపల్లి – గుడివాడ అమర్నాథ్  
11. పెందుర్తి – అన్నమరెడ్డి అదీప్ రాజ్.
12.  యలమంచిలి – కన్నబాబు రాజు 
13. పాయకరావుపేట – గొల్ల బాబూరావు
14. నర్సీపట్నం – పి. ఉమా శంకర్ గణేష్ 
15. విశాఖపట్నం సౌత్- కోలాగురువులు /ఆర్. రమణమూర్తి

 విజయనగరం జిల్లా అభ్యర్థుల వివరాలు:

1.విజయనగరం-కోలగట్ల వీరభద్రస్వామి
2. కురుపాం – పాముల పుష్ప శ్రీవాణి 
3. పార్వతీపురం – అలజంగి జోగారావు /ప్రసన్నకుమార్
4. సాలూరు – పి.రాజన్నదొర 
5. బొబ్బిలి – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు 
6. చీపురుపల్లి –బొత్స సత్యనారాయణ 
7. గజపతినగరం – బొత్స అప్పలనరసయ్య 
8. నెల్లిమర్ల – పెనుమత్స సాంబశివరాజు  
9. శృంగవరపుకోట – శ్రీనివాస్ 

శ్రీకాకుళం జిల్లా అభ్యర్థుల వివరాలు:

1. శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు  
2. పలాస – డాక్టర్ అప్పలరాజు
3. టెక్కలి – కిల్లి కృపారాణి/పేరాడ తిలక్ 
4. పాతపట్నం – శ్రీమతి రెడ్డి శాంతి 
5. ఇచ్ఛాపురం – శ్రీ పెరియ సాయిరాజ్ 
6. ఆముదాలవలస – తమ్మినేని సీతారాం 
 ఎచ్చెర్ల – గొర్లె కిరణ్ కుమార్ 
7. నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్ 
8. రాజాం – కంబాల జోగులు 
9. పాలకొండ – వి.కళావతి 

ఈ వార్తలు కూడా చదవండి

కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థుల ఖరారు : బరిలో నిలిచేది వీరే....

గుంటూరు వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి: అభ్యర్థుల జాబితా ఇదే......

నెల్లూరు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే వారి జాబితా రెడీ

చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: పోటీ చేసేది వీరే.....

అనంతపురం వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ: బరిలో నిలిచేది వీరే....

కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......

కర్నూలు వైసీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి: బరిలో నిలిచే అభ్యర్థులు వీరే.....