హైదరాబాద్: హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరానికి రెడీ అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. 

అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే కృష్ణా జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 

1. విజయవాడ తూర్పు – యలమంచిలి రవి
2. విజయవాడ సెంట్రల్ – మల్లాది విష్ణు 
3. విజయవాడ వెస్ట్ – వెలంపల్లి శ్రీనివాసరావు
4. పెనమలూరు- పార్థసారధి
5.  గుడివాడ – కొడాలి నాని 
6.గన్నవరం – యార్లగడ్డ వెంకటరావు
7. నూజివీడు – మేకా వెంకటప్రతాప్ అప్పారావు 
8. మైలవరం – వసంత కృష్ణప్రసాద్
9.జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను
10. నందిగామ- డా.మెుండితోక జగన్మోహన్ రావు
11. పామర్రు- కె. అనిల్ కుమార్ 
12. తిరువూరు – కొక్కిలగడ్డ రక్షణనిధి 
13. మచిలీపట్నం- పేర్నినాని 
14. కైకలూరు– దూలం నాగేశ్వరరావు 
15. పెడన – జోగి రమేష్ 
16. అవనిగడ్డ – సింహాద్రి రమేష్ బాబు

ఈ వార్తలు కూడా చదవండి

గుంటూరు వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి: అభ్యర్థుల జాబితా ఇదే......

నెల్లూరు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే వారి జాబితా రెడీ

చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: పోటీ చేసేది వీరే.....

అనంతపురం వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ: బరిలో నిలిచేది వీరే....

కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......

కర్నూలు వైసీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి: బరిలో నిలిచే అభ్యర్థులు వీరే.....