ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతపై జరిగిన దాడి కేసును నీరుగార్చేందుకు సీఎం ఎంతగానో మేనేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతపై జరిగిన దాడి కేసును నీరుగార్చేందుకు సీఎం ఎంతగానో మేనేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎయిర్‌పోర్టులో దాడి జరిగిన వెంటనే.. జగన్‌పై దాడి జరిగింది కోడికత్తితో కాదు.. ఫోర్క్‌తోనని.. ఆయన క్షేమంగా ఉన్నారని.. శంషాబాద్ నుంచి ఇంటికి వెళ్లిపోయారని పచ్చ మీడియాలో వచ్చాయని ఆమె ఆరోపించారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి జనవరి నుంచి కత్తిని అక్కడే ఉంచినా... కేసులు ఉన్న వ్యక్తికి ఎన్‌వోసీ ఇప్పించి ఉద్యోగంలోకి తీసుకున్నా ఎవరు ప్రశ్నించడం లేదని రోజా ఎద్దేవా చేశారు. ఛార్జిషీటులో హర్షవర్థన్ చౌదరి పేరును చేర్చేలేదని.. కాల్‌డేటాను పరిశీలించలేదని ఆమె గుర్తు చేశారు.

కత్తి కనుక మెడకు తగిలితే అక్కడికక్కడే మనిషి చనిపోతాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నా.. దానిని చిన్న ఘటనగా ముఖ్యమంత్రి తీసిపారేశారన్నారు. జగన్‌పై దాడిని దేశంలోని రాజకీయ నాయకులు ఖండిస్తే.. చంద్రబాబు దానిని పట్టించుకోలేదని.. ఆయనకు విలువలు, మానవత్వం లేవని రోజా విమర్శించారు. 

తన సామాజిక మీడియాతో.. తన మంత్రులతో జగన్‌పై ఆరోపణలు చేయిస్తూ.. ముఖ్యమంత్రి శునకానందం పొందుతున్నారని.. ఆయన శునకానందపార్టీకి జాతీయాధ్యక్షుడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తనకు అడ్డొచ్చిన వంగావీటి మోహనరంగా, ఎన్టీఆర్, వైఎస్‌లపై కుట్రలు పన్ని వారి మరణానికి కారణమయ్యారని రోజా ఆరోపించారు. అనేక సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుండటాన్ని చూసి తట్టుకోలేకే జగనోహ్మన్ రెడ్డిపై దాడికి చంద్రబాబు కుట్ర పన్నారన్నారు.

జగన్ పై దాడి.. పోలీసుల షాకింగ్ నిర్ణయం

జగన్ పై దాడి కేసులో ట్విస్ట్: జోగిరమేష్ కు నోటీసులు

జగన్ పై దాడి కేసు దర్యాప్తు: తలెత్తే ప్రశ్నలు ఇవీ...

జగన్ పై దాడి ఘటనలో టీడీపీ వెకిలి వేషాలు:పవన్ కళ్యాణ్

జగన్ పై దాడి... కత్తి మహేష్ సంచలన కామెంట్స్

జగన్ పై దాడి.. కీలకంగా మారనున్న జగన్ షర్ట్

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

జగన్ పై దాడి గురించి వారికి ముందే తెలుసా?

జగన్ పై దాడి: శ్రీనివాస్ అందులో ఆరితేరినవాడు