విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ దాడి జరిగినప్పుడు ఆయన ధరించిన షర్ట్ ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారనుంది. జగన్ ధరించిన షర్ట్ ని స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించాలని విశాఖ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసినట్లు విశాఖ పశ్చిమ ఏసీపీ ఎల్‌.అర్జున్‌ పేర్కొన్నారు. 

బుధవారం రాత్రి ఆయన ఎయిర్‌పోర్ట్‌ పోలీసుస్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. హత్యాయత్నం జరిగినప్పుడు ధరించిన షర్ట్ కి రక్తం అంటడంతో జగన్‌ దాన్ని మార్చుకుని, మరొకటి వేసుకుని విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లారని తెలిపారు. 

నిందితుడు శ్రీనివాసరావు సెల్‌ఫోన్ల కాల్‌ డేటాను విశ్లేషించామని, 321 మందితో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఉంటున్న శ్రీనివాసరావు స్నేహితుడు కూడా విశాఖ వచ్చాడని అతని నుంచీ సమాచారం రాబడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.


read more news

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స