ఏపీ ప్రతిక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ స్పందించారు. ఎప్పుడు ఎవరిమీదో ఒకరిమీద ఆరోపణలు చేస్తూ.. కత్తి మహేష్ కి వార్తల్లోకి ఎక్కడం అలవాటే. తాజాగా.. జగన్ పై దాడి ఘటన గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశాడు.

కత్తి మహేష్ సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడుతూ...‘‘ జగన్ పై దాడి జరిగిన రోజే లైవ్ లోకి వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. కానీ.. ఈ ఘటనలో నిజానిజాలు బయటకు రావాలి. అసలు దాడి ఎలా జరిగిందో తెలియాలనే ఇన్ని రోజులు వెయిట్ చూశాను. నిజాలు తెలియకపోతే ఏం మాట్లాడలేం. కేవలం దాడి ఘటనను ఖండించడం తప్ప.  అందుకే ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది.’’ అని కత్తి మహేష్ అన్నారు.

‘‘ఏపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మన ప్రజాస్వామ్యం చాలా ప్రమాదకరంగా ఉంది. హత్యారాజకీయాల నేపథ్యం ప్రజాస్వామ్యానికి హానిచేస్తుందనిపిస్తోంది. జగన్ పై దాడి జరిగిందన్న విషయం కన్నా.. టీడీపీ నేతలు స్పందించిన తీరు నన్ను షాకింగ్ కి గురిచేసింది. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా? ఎలాంటి విచారణ చేపట్టకుండా డీజీపీ స్టేట్ మెంట్ ఇవ్వడం షాకింగ్ గా అనిపించింది.’’

‘‘ ఇక ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దీనిని రాజకీయ నాటకం అనడం హేయమైన చర్య. ఎవరైనా సరే.. ఒక వ్యక్తిపై దాడి జరిగితే.. సానుభూతి ప్రకటిస్తారు లేదా ఘటనను ఖండిస్తారు. సాటి మనిషిలా స్పందించి.. త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి.  కానీ.. కనీసం దర్యాప్తు చేయకుండా  డ్రామా అని తేల్చేస్తారా? ఇలా చేస్తే విచారణ సీరియస్ గా సాగుతుందనే నమ్మకం ఎలా ఉంటుంది.’’

‘‘చంద్రబాబు కనీసం జగన్ కి ఫోన్  చేసి ఉంటే ఆయన స్థాయి పెరిగిపోయేది. కానీ తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన చౌకబారు మాటలు వింటే.. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనిపిస్తోంది. జగన్ తల్లీ, చెల్లీ దాడి చేయించారంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వింటే... ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జంతువు అనే అనుమానం కలిగింది’’ అంటూ కత్తి మహేష్ ఘాటుగా స్పందించాడు. 

read more news

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ